OTTకి.. సూర్య లేటెస్ట్ రూ.200 కోట్ల చిత్రం స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే...
ABN, Publish Date - May 26 , 2025 | 10:20 AM
తమిళ స్టార్ సూర్య కంగువా తర్వాత వచ్చిన చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు, పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా కంగువా వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం రెట్రో (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక కాగా నాజర్ (Nasser), జోజు జార్జ్ (joju george), ప్రకాశ్ రాజ్ (Prakash Ra), జయరాం (Jayaram) కీలక పాత్రల్లో నటించారు. క్రియేటివ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహించాడు. మే1న నాని హిట్3 సినిమాతో పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగు వారిని అసలు మెప్పించలేక పోయింది. కానీ తమిళనాట రూ200కోట్లు వసూళ్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఆపై ఈ సినిమా కొన్ని సినిమాలకు రిమేక్ అని వార్తలు కూడా బాగానే హల్‌చల్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మేకర్స్ సోమవారం అధికారంగా ప్రకటించారు.
పారి అలియాస్ పార్వేల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే పుట్టిన ఊరికి.. తల్లిదండ్రులకు దూరం అవుతాడు. గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) భార్య దగ్గరకు తీసుకుని పెంచుతుంది. తిలక్‌కు ఇది అసలు ఇష్టం లేక పోయినా ఓ ప్రమాదం నుంచి పారి కాపాడడంతో అతన్ని ఐరన్ హ్యాండ్‌గా భావించి కొడుకులా చూస్తాడు. తిలక్‌తో పాటే పారి కూడా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. చిన్నతనంలో పరిచయమైన రుక్మిణి 15 ఏళ్ల తర్వాత తారస పడటంతో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆపై గ్యాంగ్‌స్టర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెడతానని రుక్మిణికి మాటిస్తాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిణామాలేంటి? తిలక్‌తో అతనికి వైరం, గోల్డ్ ఫిష్ గొడవ ఏంటి? మళ్లీ హింసాత్మక వృత్తిలోకి ఎందుకు దిగాడు.. అండమాన్ దీవిలో ఉన్న ఊరుకి, పారికి సంబంధం ఏంటి అన్నది కథ.
కార్తీక్ సుబ్బరాజ్ ఎంచుకునే కథలే మొదటి నుంచి వైవిధ్యంగా ఉండి అతనకో ప్రత్యేకమైన పేరును తీసుకు వచ్చాయి. కథ ఎలాంటిదైనా కొత్తగా చెప్పాలనుకుంటాడు. న్యూ ఏజ్ స్టైల్లో అతని చిత్రీకరణ ఉంటుంది. అందుకు అతని గత చిత్రాలే ఉదాహరణ. కథలో యాక్షన్ ఉన్నా.. లోపల ఏదో సందేశం ఉంటుంది. ఈ రెట్రో కూడా అంతే. 1960 – 1993ల మధ్య సాగే క. అయితే దీనిని ప్రేమ.. నవ్వు.. యుద్థం.. అని మూడు పార్టులుగా విడదీసి తెరకెక్కించారు. ప్రేమ కోసం హింసకు దూరమైన కథానాయకుడు, మళ్లీ అదే ప్రేమను దక్కించుకోవడానికి అదే దారిలో వెళ్లి యుద్ధం చేయాల్సి వస్తే అన్నది ఇందులో ప్రధానాంశం.
అలాగే బానిసలుగా ఉన్న ఓ జాతి లో నవ్వులు పూయించేందుకు పారి ఏం చేశాడన్నది కూడా ఓ లైన్. ఈ క్రమంలో సినిమా తొలి అరగంటలోనే సూర్య, పూజా, జోజుల మధ్య 15 నిమిషాల సింగిల్ టేక్ షాట్‌లో పాటతో పాటు యాక్షన్, డ్రామా సీన్లు తెరకెక్కించిన సన్నివేశాలు హైలెట్. మన దేశ సినిమాల్లోనే ఇంతవరకు అలాంటి ధైర్యం చేయలేదు. ఇప్పుడీ సినిమా మే31 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఇంతవరకు ఈ సినిమా చూడని వారు, కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలంటటే ఇష్ట పడేవారు ఓ సారి ఈ రెట్రో (Retro) చిత్రాన్ని చూడొచ్చు.