సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jatadhara OTT: స‌డ‌న్‌గా.. ఓటీటీకి డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - Dec 05 , 2025 | 06:05 AM

ఎన్నో అంచ‌నాల న‌డుమ న‌వంబ‌ర్7న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి తీవ్రంగా నిరాశ‌ ప‌ర్చిన చిత్రం జ‌టాధ‌ర ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆడియ‌న్స్‌కు షాక్ ఇచ్చింది.

Jatadhara

ఎన్నో అంచ‌నాల న‌డుమ న‌వంబ‌ర్7న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి తీవ్రంగా నిరాశ‌ప‌ర్చిన చిత్రం జ‌టాధ‌ర (Jatadhara) ఎలాంటి ముంద‌స్తుప్ర‌క‌ట‌న లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆడియ‌న్స్‌కు షాక్ ఇచ్చింది. సుధీర్‌బాబు (Sudheer Babu) భారీ హైప్స్ పెట్టుకున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌గా 30 ఏండ్ల త‌ర్వాత న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ (Shilpa Shirodkar)తెలుగు తెర‌పై రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. కాగా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న భ‌క్తి, దేవుడు, దైవ‌త్వం బ్యాక్డ్రాప్‌లోనే ఈ ఈ మూవీ హిందీ, తెలుగులో తెర‌కెక్క‌డం విశేషం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆత్మ‌లంటే న‌మ్మ‌కం లేని శివ ఆ పేరుతో మోసాలు చేసే వారిని అడ్డుకుంటూ ఉంటాడు. అయితే ఓ పిల్లాడిని ఇద్ద‌రు అగంత‌కులు చంపుతున్న‌ట్లు త‌న‌కు వ‌స్తున్న క‌ల‌ను చేదించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. మ‌రోవైపు శివ జాత‌కాన్ని ప్రేయ‌సి సితార ఓ జాత‌కుడికి చూపించ‌గా వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్రాణాపాయం ఉన్న‌ట్లు చెబుతాడు. కాసేప‌టికి ఆ ప్ర‌మాదం నుంచి కూడా బ‌య‌ట‌ప‌డ‌తారు.

అదేస‌మ‌యంలో రుద్రారం అనే గ్రామంలో లంకెబిందెల ర‌హాస్యాన్ని బ‌య‌ట పెట్టేందుకు వెళ్లిన ఓ వ్య‌క్తి చ‌నిపోగా దాని వెన‌క ఉన్న మిస్ట‌రీని తెలుసుకునేందుకు శివ అ ఊరికి బ‌య‌లుదేరుతాడు. కాగా ఈ విష‌యం తెలుసుకుంటున్న త‌ల్లిదండ్రులు అక్క‌డ‌కు వెళ్లొద్ద‌ని వారిస్తారు. ఇంత‌కు లంకెబింద‌ల‌కు, ఆ విలేజ్‌కు, శివ‌కు ఉన్న లింకేంటి, ఆత్మ‌లు, అక్క‌డి ర‌హాస్యాల‌ను శివ చేధించాడా లేదా అనేదే స్టోరి.

అయితే.. మ‌నం ద‌శాబ్దాలుగా వింటూ వ‌స్తూ ఉన్న పూర్వం రోజుల్లో బంగారం బిందెల్లో దాచి పెట్టి దాచే వార‌ని ఆ స‌మ‌యంలో వాటికి ర‌క్ష‌ణ‌గా నాగ‌, పిశాచ బంధ‌నాలు వేసేవారరు అనే కనేక క‌థ‌లు విన్నాం.అలాంటి లంకె బిందెలను సొంతం చేసుకోవాల‌నుకున్న ఓ ఫ్యామిలీ ఏం చేసింది, ఉలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి, ధ‌నానికి కాపాలాగా ఉన్న పిశాచి మేల్కొంటే ఏం జ‌రిగింది అనేది పాయింట్‌.

అయితే ద‌ర్శ‌కత్వం అనుభ‌వ లేమి, ఎడిటింగ్ నిర్ల‌క్ష్యం ఇత్యాది అంశాల‌తో సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఏ కోశానా క‌నెక్ట్ అవ‌దు. ఎ స‌న్నివేశం ఎప్పుడు, ఎందుకు వ‌స్తుందో అస‌లు అంతుప‌ట్ట‌దు. ఇప్పుడు ఈ జ‌టాధ‌ర (Jatadhara) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT) లో తెలుగులో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

Updated Date - Dec 05 , 2025 | 06:05 AM