Stranger Things 5: ఒక్కో ఎపిసోడ్.. 2 గంటల రన్ టైమ్
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:59 AM
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ .
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things)త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అయితే. .ఈ సీజన్ 5 విడుదల దగ్గర పడుతున్న సమయంలో రోజురోజుకు ఈసిరీస్‌పై భారీ హైప్ ఏర్పడుతోంది. నాలుగు సీజన్ల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మేకర్స్ కొత్త సీజన్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటే, తాజాగా వచ్చిన,వస్తున్న రూమర్స్ వారిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
విషయానికి వస్తే.. గత నాలుగు సీజన్ల వరకు ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు సాగింది. అయితే.. ఇప్పుడు రానున్న సీజన్ 5లో ఒక్కో ఎపిసోడ్ సుమారు 2 గంటల రన్ టైమ్ ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సిరీస్‌లు కూడా ఇంత నిడివి ఉన్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ సిరీస్ ఆ ప్రయత్నం చేస్తుందని న్యూస్ రూమర్స్ వస్తుండడంతో ఫ్యాన్స్ ఒకింత అశ్యర్యానికి గురవుతుండడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక.. ఈ సీజన్ ఒక్కో ఎపిసోడ్ కోసం 50 నుంచి60 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెట్టారనే టాక్ కూడా ఉంది. విజువల్ ఎక్స్ఫీరియన్స్ అందించగానికి గ్రాండ్ ఎఫెక్ట్స్, CGIలను ఓ రేంజ్‌లో ఉపయోగించారని తెలుస్తోంది. మరోవైపు మేకర్స్ ఈ సీజన్5ని రెండు వాల్యూమ్‌లుగా విడదీసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో వాల్యూమ్ 1 ఈ నవంబర్ 27 నెట్‌ఫ్లిక్స్ (Netflix release)లో స్ట్రీమింగ్ అవనుంది. రెండో వాల్యూమ్ డిటైయిల్స్ వచ్చే సంవత్సరం ప్రకటించనున్నారు. మరి వార్తలు వస్తున్నట్టుగా నిజంగా ఒక్కో ఎపిసోడ్ రెండు గంటలు ఉంటాయా, లేక తక్కువగా ఉంటాయా అన్నది రియల్ రిలీజ్ తర్వాతే స్పష్టమవుతుంది. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.