Maaman OTT: సడన్‌గా.. తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా
ABN, Publish Date - Aug 28 , 2025 | 10:40 PM
రెండు నెలల క్రితం తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం మామన్
రెండు నెలల క్రితం తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం మామన్ (Maaman). కమెడియన్ నుంచి హీరోగా ఎదిగి వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సూరి (Soori) ఈ మూవీతో కథానాయకుడు. ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కథానాయిక. రాజ్ కిరణ్, స్వసిక, బాల శరవణన్, బాబా భాస్కర్, విజ్జి చంద్రశేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రశాంత్ పాండియరాజ్ (Prasanth Pandiyaraj) దర్శకత్వం వహఙంచగా హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందించాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉన్నఫలంగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది.
కథ విషయానికి వస్తే.. హీరో.. ఇన్‌బా చెల్లెలు గిరిజకు పెళ్లై పదేళ్ల తర్వాత అబ్బాయి పుడతాడు.లేక లేక పుట్టిన మేనల్లుడు నిలన్ అంటే ఇన్‌బాకు చచ్చేంత ప్రేమ ఉంటుంది. ఒక్క క్షణం విడిచి ఉండలేడు. ఈఅదే సమయంలో ఇన్‌బా, రేఖను పెళ్లి చేసుకుంటాడు. అయినా అల్లుడు (లడ్డు) మామతోనే ఉంటాడు. ఇది నచ్చని అత్త రేఖ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. అల్లుడు మామకు ఎందుకు, ఎలా దూరం కావాల్సి వచ్చింది, ఇన్‌బా, రేఖ రలిసే ఉన్నారా, లేదా అనే పాయింట్లతో సినిమా చివరి వరకు ఫుల్ ఎమోషనల్ రైడ్‌గా, భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ చిత్రంగా ఉంటుంది.
ఆగస్టు మొదటి వారం నుంచి తమిళంలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం సడన్‌గా ఇప్పుడు జీ5 (ZEE 5) ఓటీటీలో 27 బుధవారం నుంచి కొత్తగా తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం ఫుల్ మీల్స్ భోజనం లాంటిది. మొదటి షాట్ నుంచి చివరి వరకు కుటుంబాలు సంబంధాలు, ఈగోలు, గొడవలు, ప్రేమలు, ఆప్యాయతల చుట్టూ మూవీ ఉంటుంది. ఒక్క ఫస్ట్ నైట్ సిన్ మినహా ఇంటిల్లాపాది కలిసి మామన్ (Maaman) సినిమాను చూసేయవచ్చు.