సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada OTT: ఓటీటీకి వ‌చ్చేసిన‌.. 'తెలుసుక‌దా'! జ‌నం.. ఇక్క‌డైనా క‌నెక్ట్‌ అవుతారా

ABN, Publish Date - Nov 14 , 2025 | 05:59 AM

దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి పెద్ద‌గా ప్రేక్షకులను కనెక్ట్ కాలేక‌పోయిన సిద్ధు జొన్నలగడ్డ న‌టించిన కొత్త చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియ‌న్స్‌ ముందుకు వ‌చ్చేసింది.

Telusu Kada OTT

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వ‌రుస విజయాల తర్వాత మంచి జోష్‌లో క‌నిపించిన‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కు జాక్ పెద్ద‌ షాక్ ఇచ్చింది. దాంతో కాస్త జాగ్ర‌త్త‌ ప‌డి చేసిన చిత్రం తెలుసు కదా (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఫ‌స్ట్ టైం దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వ‌గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు. రాశీఖ‌న్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లు. అయితే ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన ఈ చిత్రానికి పెద్దగా నెగటివ్ టాక్ రాకపోయినా కథ ప్రేక్షకులను కనెక్ట్ చేయలేదు. దీంతో సిద్ధుకు బాక్సాఫీస్ వ‌ద్ద‌ నిరాశ త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఓటీటీ ఆడియ‌న్స్‌ ముందుకు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అనాధ అయిన వరుణ్‌ (సిద్ధు జొన్నలగడ్డ తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని కలలుకంటూ ఉంటాడు. ఓ స‌మ‌యంలో తన ప్రమేయం లేకుండానే జరిగిన బ్రేకప్ తర్వాత వరుణ్ అన్నీ వ‌దిలేసి అంజలి (రాశీఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే.. కొద్ది రోజుల‌కే అంజలికి పిల్లలు పుట్టరనే విషయం బ‌య‌ట‌ప‌డుతుంది. దాంతో సరోగసీ ద్వారా పిల్లలను కనాలని రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్‌ను సంప్ర‌దిస్తారు. వారికి తానే సరోగసీ ద్వారా బిడ్డ కని ఇస్తాన‌ని డాక్ట‌ర్‌ చెబుతుంది. అందుకు వరుణ్ అంగీకరించాడా? వరుణ్‌కు రాగాల‌కు ఎందుకు బ్రేక‌ప్ అయింది. ఆ విష‌యం అంజలి వ‌ద్ద‌ ఎందుకు దాచి పెట్టారు? త‌ర్వాత ఎలాంటి పర్యవసానాలు ఎదుర‌య్యాయ‌నేదే క‌థ‌.

ఇదిలాఉంటే.. పెళ్లైన జంట జీవితంలో సరోగసీ కారణంగా ఎదురయ్యే అసౌకర్యాలు, అందులోకి హీరో గతం అనుకోకుండా చేరడం వంటి అంశాలపై సాగిన ఈ రొమాంటిక్ డ్రామా మొదటి భాగంలో ఆసక్తికరంగా నడిచినా.. రెండో భాగంలో కథనం నెమ్మదించి భావోద్వేగాలు సరిగా పండక సినిమా సరైన గ్రిప్ అందుకోలేకపోయింది. సిద్ధు, శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా నటనలు సరిగానే ఉన్నా, పాత్రలకు మరింత డెప్త్ ఉంటే బావుండు అనే ఫీల్ వ‌స్తుంది.

టెక్నికల్‌గా చూస్తే థమన్ కంపోజ్ చేసిన ‘మల్లిక గంధ’ పాట ఆకట్టుకోగా.. స్టోరీ–స్క్రీన్‌ప్లేలో క్లారిటీ లోపించి నీరజ కోన చూపించిన కొత్త కోణం కన్‌ఫ్యూజన్‌గా మారింది. సినిమాలో కాస్త‌ భిన్నమైన పాయింట్ ట‌చ్ చేసినందుకు డైరెక్ట‌ర్‌ను అభినందించాల్సిందే. అయితే.. థియేట‌ర్ క‌న్నా ఓటీటీలో చూసే వారికి ఈ చిత్రం బాగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, మంచి రోమాంటిక్ డ్రామా చూడాల‌నుకునే వారు ఈ సినిమాను చూడ‌వ‌చ్చు. పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం బెట‌ర్‌.

Updated Date - Nov 14 , 2025 | 06:03 AM