సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kaliyugam 2064 OTT: తెలుగులోనూ.. ఓటీటీకి వ‌చ్చేసిన అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:05 PM

డిజిట‌ల్ వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ డిప‌రెంట్ పోస్ట్ అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీకి వ‌చ్చింది.

Kaliyugam 2064

డిజిట‌ల్ వీక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ డిప‌రెంట్ పోస్ట్ - అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం క‌లియుగం 2064 (Kaliyugam 2064) ఓటీటీకి వ‌చ్చింది. జ‌ర్సీ ఫేం శ్ర‌ద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), క‌న్న‌డ కిశోర్ (Kishore) కీల‌క పాత్ర‌లు పోషించ‌గా ప్ర‌మోద్ సుంద‌ర్ (Pramodh Sundar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌ర‌ల్డ్ వార్ త‌ర్వాత‌ ఆహారం దొర‌క్క‌, నీటి ఎద్దటి ఏర్పడితే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో, ఇప్పటి వరకు ఏ సినిమాలోను టచ్ చేయని పాయింట్‌ను తీసుకొని ఓ యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్ప‌టికే ప‌లు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న‌ప్ప‌టికీ తెలుగులో రాలేదు. కాస్త గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేశారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ప్రపంచ యుద్ధం తర్వాత సమాజం రెండు వర్గాలుగా విడిపోతుంది. ఒకవైపు అత్యంత సంపన్నులు రెసిడెంట్స్ గా, మరొకవైపు పేదలు లిబరేటర్స్ గా బానిసల జీవితాన్ని గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో లిబరేటర్ వ‌ర్గానికి చెందిన‌ భూమి (శ్రద్దా శ్రీనాథ్), కిషోర్ ఇద్ద‌రు రెసిడెంట్స్ వ‌ర్గానికి చెందిన థామస్ (ఇనియన్ సుబ్రమణి) చేతిలో బందీలుగా మారుతారు. అస‌లు వారిని ఎందుకు బంధించారు, దాని వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటి, రతి ఎవరు? 2064 సంవత్సరంలో జరిగే సంఘటనలకు కల్కికి ఉన్న సంబంధం ఏమిటి? అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

యుద్దాల వల్ల ఆహార, నీటి కొరత ఏర్పడితే.. మనుషులు ఎలా ఉంటారు, ఎలా త‌యార‌వుతారు, ఎంత‌వ‌ర‌కు వెళ‌తారు, ఆ స‌మ‌యంలో ఎలా ఆహారం ఉంటుంది అనే విష‌యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడీ సినిమా తెలుగు వ‌ర్ష‌న్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, త‌మిళ వెర్ష‌న్ స‌న్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓ వెరైటీ చిత్రం చూడాల‌నుకునే వారు ఓ మారు ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చు. సినిమాలో సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ వంటి కీల‌క విభాగాల పనితీరు అద్భుతంగా కుదిరింది.

Updated Date - Jul 11 , 2025 | 12:24 PM