Mirai OTT: షాకింగ్.. సడన్‌గా ఓటీటీకి మిరాయ్! ఎంతులో.. ఎప్పటినుంచంటే
ABN, Publish Date - Oct 04 , 2025 | 11:26 AM
థియేటర్లలో మంచి ఆక్యూపెన్సీతో కలెక్షన్లు రాబడుతూనే ఉంది మిరాయ్. అయితే సడన్‌గా ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
గత నెలలో థియేటర్లకు వచ్చి బాక్సాపీసును షేక్ చేసిన చిత్రం మిరాయ్ (Mirai). హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ చిత్రంపై గభారీ అంచనాలు నెలకొనగా వాటికి తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. ఈగల్ సినిమా తర్వాత కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మంచు మనోజ్ (Manoj Manchu), రితికా నాయక్ (Ritika Nayak), శ్రీయ, జగపతిబాబుల, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే థియేటర్లలో రూ. 300 కోట్ల వరకు రాబట్టిన ఈ చిత్రం స్టిల్ థియేటర్లలో మంచి ఆక్యూపెన్సీతో కలెక్షన్లు రాబడుతూనే ఉంది. అయితే సడన్‌గా ఈస సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. Mirai OTT
కథ విషయానికి వస్తే.. పూర్వం యుద్దాలతో ఊహించని స్థాయిలో రక్తపాతాలు సృష్టించిన అశోకుడు తాను చేసిన రణరంగానికి చింతిస్తూ పశ్చాతప పడుతాడు. ఈ నేపథ్యంలో తనకు ఉన్న శక్తులను 9 గ్రంథాలలో నిక్షిప్తం చేసి వాటికి రక్షకులను నియమిస్తాడు. కాలక్రమంలో అవి చేతులు మారి వారి వారసులు వాటిని కాపాడుతుంటారు. అదే సమయంలో వాటి గురించి తెలుసుకున్న మహావీర్ లామా వాటిలో 8 పుస్తకాలు సొంతం చేసుకుని మిగిలి ఉన్న 9వ పుస్తకం కోసం వేట మొదలు పెడతాడు. కానీ అంబిక దానిని అంతుచిక్కని ప్రదేశంలో దాచి అందుకు సంబంధించిన సమాచారాన్ని తన కుమారుడికి మాత్రమే తెలిసేలా చేసి చనిపోతుంది. ఈక్రమంలో లామా ఆ పుస్తకాన్ని దక్కించుకున్నాడా లేదా, అంబిక కుమారుడు ధీర అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు,, ఈ కథకు రామాయణానికి ఉన్న లింక్ ఏంటి, అసలు మిరాయ్ ఏంటి అనేది ఈ చిత్రం కథ. Mirai OTT
ట్రైలర్, టీజర్లతోనే అదిరే హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం థియేటర్లకు ్చ్చాక అందకుమంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది, యాక్షన్ సీన్లు, తేజ, మనోజ్ నటన హైలెట్‌గా నిలిచింది. అంతేగాక రాముడిని కూడా కథలోకి తీసుకు రావడంతో చూసే వారికి గూస్ బంప్స్ సైతం వచ్చాయి. అలాంటి ఈ చిత్రం ఇంకా థియేటర్లలో విజయవంతంఆ రన్ అవుతున్నప్పటికీ సడన్‌గ ఓటీటీకి తీసుకు వస్తున్నట్లు పరకటించారు. ఆక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం చేశారు. సో.. ఎవరైతే థియేటర్లలో మిస్సయ్యారో, మరో సారి చూడాలనుకునే వారికి ఇది నిజంగా ఎగిరి గంతేసే వార్త.