Little Hearts: నైటీ యువతి చెడ్డీ యువకుడు ఓటీటీకి వచ్చేశారు
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:58 AM
గత నెలలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసిన చిన్న చిత్రం లిటిల్ హర్ట్స్.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసిన చిన్న చిత్రం లిటిల్ హర్ట్స్ (Little Hearts). కేవలం రూ.5 కోట్ల వ్యయంతో రూపొంది రూ. 40 కోట్ల మేర వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తర్వాత మదరాసి, ఓజీ వంటి భారి సినిమాల నుంచి పోటీని సైతం తట్టుకుని స్టిల్ ఇప్పటికీ చాలా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేసిన దానికి మరింత స్టప్ జత చేసి ఎక్స్టెండెడ్ కట్‌తో డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు.
కథ విషయానికి వస్తే.. 2015 సమయంలో సాగే కథ ఇది. సరిగా చదువు అబ్బని ఇద్దరు టీనేజర్స్.. వారి వారి ఇండ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి? పిల్లల ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచనలు, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అన్న స్టోరీకి రొమాంటిక్ లవ్‌స్టోరీ, వినోదాన్ని జోడించి సింపుల్ లైర్ డైలాగ్స్థో యూత్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన సినిమా ఇది. వయసులో హీరోయున్ కన్నా చిన్నవాడైన హీరో ఆ ఇద్దరి జంట కలిసి పెద్దలను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తమ ఇండ్లలో జరిగిన గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పెదాలపై నవ్వు చెరిగో పోకుండా చివరి వరకు నడిపిస్తుంది. హ్యుమర్ సెన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
ఇప్పుడీ సినిమా ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ప్రసారం అవుతుంది. థియేటర్‌లో మిస్సయిన వారు ..మల్లీ మళ్లీ చూడాలనుకునే వారికి ఇది బంఫారాఫర్. ఏంచక్కా ఇంట్లోనే కుటంబం అంతా కలిసి హయిగా నవ్వుకుంటూ ఈ లిటిల్ హర్ట్స్ (Little Hearts) సినిమాను ఆస్వాదించవచ్చు. గతంలో 90 వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన. ప్రేమలు సినిమాకు మాటలు అందించిన ఆదిత్య హసన్ (Aditya Hasan) ఈ చిత్రాన్ని నిర్మించగా సాయి మార్తాండ్ (Sai Marthand) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మౌళీ తనూజ్ (Mouli Tanuj Prasanth), శివానీ నగరం (Shivani Nagaram) జంటగా నటించారు. రాజీవ్ కనకాల (Rajeev Kanakala), అనిత, కాంచి కీలక పాత్రలు, సత్యా కృష్ణన్ కీలక పాత్రలు చేశారు.