OTT: మాంచి.. ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీ! తెలుగులోనూ వచ్చేసింది ఆ ఓటీటీలో
ABN, Publish Date - Sep 14 , 2025 | 07:32 AM
మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై అద్భుత విజయం సాధించిన హాలీవుడ్ రొమాంటిక్ చిత్రం మెటీరియలిస్ట్.
మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై అద్భుత విజయం సాధించిన హాలీవుడ్ రొమాంటిక్ చిత్రం మెటీరియలిస్ట్ (Materialists). ప్రపంచ యూత్ కలల రాణి డకోటా జాన్సన్ (Dakota Johnson) కథానాయికగా మరోమారు ఆకట్టుకోగా రీసెంట్ సెన్షేషన్ పెడ్రో పాస్కల్ (Pedro Pascal), క్రిస్ ఎవాన్స్ (Chris Evans) ప్రధాన పాత్రల్లో నటించారు. సెలిన్ సాంగ్ (Celine Song) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ మూవా ప్రపంచ వ్యాప్తంగా 53 మిలియన్లను రాబట్టి భారీ సక్సెస్ దక్కించుకుంది. నెలన్నర క్రితమే బయటి దేశాల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ఇటీవల ఇండియాలోనూ అందుబాటులోకి రాగా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది..
నటిగా సక్సెస్ దక్కించుకోలేక పోయిన లూసీ న్యూయార్క్ సిటీలో ప్రొఫెషనల్ మ్యాచ్ మేకర్‌గా తన వద్దకు వచ్చే యువతీయువకులకు వారి వారి కోరికలకు అనుగుణంగా డేటింగ్, మ్యారేజ్ వంటివి కుదురుస్తుంటుంది. అయితే.. అప్పటికే తన సహా నటుడిడు ఫించ్‌తో బ్రేకప్ చేసుకున్న లూసీ ఓ పెళ్లిలో పరిచయం అయిన మిలియనీర్ హ్యారీతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేయాలని చూస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో మాజీ లవర్ తిరిగి తన జీవితంలోకి రావడంతో లూసీ అయోమయంలో పడుతుంది. హ్యారీతో కంటిన్యూ అవ్వాలా లేక ఫించా, డబ్బు, ప్రేమ ఏది ముఖ్యం అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగతూ ఆకట్టుకుంటుంది.
మూవీ స్టోరీ కథనం స్లోగా సాగినా ఎక్కడా బోర్ కొట్టకుండా ముగ్గురు హేమాహేమీలైన నటులు తమ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తారు. ఫీల్‌గుడ్ మూవీ చూశామనే తృప్తి ఇస్తుంది. డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. అయితే ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నందును పిల్లలకు దూరంగా ఈ మూవీని చూడడం బెటర్. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అయిన ఈ మెటీరియలిస్ట్ (Materialists) చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భారతీయ భాషల్లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ డ్రామాలు ఇష్ట పడే వారు, డకోటా జాన్సన్, పెడ్రో ఫాస్కల్, క్రిస్ ఎవాన్స్ అభిమానులు మిస్ చేయకూడని చిత్రం ఇది.