సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Fantastic Four OTT: మార్వెల్ సూప‌ర్ హీరోస్.. ఓటీటీకి వ‌చ్చేశారు! తెలుగులోనూ.. డోంట్ మిస్

ABN, Publish Date - Sep 24 , 2025 | 06:36 AM

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్

The Fantastic Four

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps). మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ చిత్రం, లెజెండరీ సూపర్ హీరోల టీమ్‌ ఫాంటాస్టిక్ ఫోర్ బృందాన్ని తొలిసారిగా MCU (Marvel Cinematic Universe) లోకి ప్ర‌వేశ‌ పెట్టింది. ఈ చిత్రానికి మాట్ షక్మాన్ (Matt Shakman) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా పెడ్రో పాస్కల్ (Pedro Pascal), వెనెస్సా కిర్బీ (Vanessa Kirby), ఎబోన్ మోస్-బచ్రాచ్ (Ebon Moss-Bachrach), జోసెఫ్ క్విన్ (Joseph Quinn), జూలియా గార్నర్ (Julia Garner), సారా నైల్స్ (Sarah Niles) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్ల (1200 కోట్లు)తో రూపొందిన ఈ చిత్రం $521 మిలియ‌న్ల‌ను (4380 కోట్లు) రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. సైన్స్ ఫిక్షన్, కుటుంబ బంధాలు, అద్భుతమైన యాక్షన్‌ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. కాస్మిక్ రేలకు గురై అద్భుతమైన శక్తులు పొందిన తర్వాత రీడ్ రిచర్డ్స్‌, స్యూ స్టోర్మ్‌, బెన్ గ్రిమ్‌, జానీ స్టోర్మ్ అనే నలుగురు వ్యోమగాములు ఫాంటాస్టిక్ ఫోర్ అనే సూపర్ హీరోల బృందంగా మారతారు. ఆపై ప్ర‌పంచాన్ని అనేక విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి ర‌క్షిస్తూ నాలుగేండ్ల‌లోనే బాగాఫేమ‌స్ అయిపోతారు. కొన్నాళ్ల‌కు రీడ్, స్యూ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఆ బాలుడు ఎలాంటి వాడై ఉంటాడ‌నే చ‌ర్చ మొద‌ల‌వుతుంది.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. విశ్వంలోని గ్ర‌హాల‌న్నింటినీ క‌బ‌లించి కేవ‌లం త‌న గ్ర‌హం ఉనికిని మాత్ర‌మే ఉంచేందుకు రూపం లేని గాలాక్టస్ అనే మ‌హా శ‌క్తి దండ‌యాత్ర స్టార్ట్ చేస్తుంది. ఒక దాని త‌ర్వాత మ‌రో గ్ర‌హాన్నిరూపు రేఖ‌లు లేకుండా చేస్తూ వ‌చ్చి త‌న త‌దుప‌రి ల‌క్ష్యం భూమి అని త‌న సేవ‌కురాలు సిల్వర్ సర్ఫర్‌ను భూమి పైకి పంపుతుంది. రీడ్ సైతం పరిశోధనలు చేసి ఇది నిజమని నిర్ధారించడంతో, ఫాంటాస్టిక్ ఫోర్ ముందుగానే అంతరిక్ష యాత్ర చేపట్టి గాలాక్టస్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. అక్కడ గాలాక్టస్, స్యూ గర్భంలోని శిశువులో అపారమైన కాస్మిక్ శక్తి ఉందని గ్రహించి, తన ఆకలిని ఆ శక్తి తీర్చగలదని చెబుతాడు. ప్రతిగా ఆ బిడ్డను తనకు ఇస్తే భూమిని విడిచిపెడతానని ఆఫర్ చేస్తాడు.

అయితే.. ఫెంటాస్టిక్ ఫోర్ బృందం అందుకు స‌మ్మ‌తించ‌క భూమికి తిరిగి వస్తుంది. ఈ విష‌యం తెలిసి ఆ బిడ్డను గాలాక్టస్‌కు అప్పగించచాలంటూ ప్ర‌జ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ సూప‌ర్ హీరోల బృందం ఏం చేసింది, ఆ మ‌హా శ‌క్తిని ఎలా ఎదుర్కొన్నారు. అందుకు ఎలాంటి ఫ్లాన్ చేశారు. అ బిడ్డ‌ను అప్ప‌గించారా లేదా, సిల్వర్ సర్ఫర్ ఏం చేసింది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ (Primevideo), యాపిల్ టీవీ ఫ్ల‌స్ (AppleTv+) ఓటీటీ (OTT) ల‌లో ఇంగ్లీష్‌తో పాటు ఇత‌ర సౌత్ భాష‌లన్నింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే రెండు వారాల పాటు రెంట్ ప‌ద్ద‌తిలో మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుండ‌గా ఆ త‌ర్వాతే ఉచింత‌గా స్ట్రీమింగ్ కానుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, సూప‌ర్ హీరోస్‌, మార్వెల్ చిత్రాలు ఇష్ట ప‌డే వారు త‌ప్ప‌క చూడాల్సిన మూవీ ఇది. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌, అశ్లీల స‌న్నివేశాలు కూడా లేవు ఎంచ‌క్కా కుటంబ స‌మేతంగా హ‌యిగా ఋ ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps) మూవీ చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 24 , 2025 | 08:10 AM