Mass Jathara OTT: ఓటీటీకి వ‌చ్చేసిన.. ర‌వితేజ 'మాస్ జాత‌ర‌'

ABN , Publish Date - Nov 28 , 2025 | 07:56 AM

ర‌వితేజ, శ్రీలీల క్రేజీ కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌ర్చిన చిత్రం మాస్ జాత‌ డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Mass Jathara

ర‌వితేజ (Ravi Teja), శ్రీలీల (Sri Leela) క్రేజీ కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌ర్చిన చిత్రం మాస్ జాత‌ర (Mass Jathara). ఇప్పుడు డిజిట్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. సితార ఎంట‌ర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాతో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఫేం డైలాగ్ రైట‌ర్ భాను భోగ‌వ‌ర‌పు డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. థియ‌టర్ల‌లో అంత‌గా అక‌ట్టుకోలేక పోయిన చిత్రం ఓటీటీలో ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

కథలోకి వెళ్తే.. లక్ష్మణ్ భేరీ (రవితేజ) చిన్నప్పటి డ్రీమ్ పోలీస్ అవ్వడం. కానీ నిజాయితీ కారణంగా తన కొడుకును, కోడలిని కోల్పోయిన తాత (రాజేంద్ర ప్రసాద్) సేఫ్ అని మనవడిని రైల్వే పోలీస్ చేస్తాడు. “ఇక్కడ రిస్క్ తక్కువ” అని చెప్పినా.. హీరో మాత్రం ఎక్కడకు పోయినా, ఏ పనైనా అంతా నాదే అనేలా స‌మ‌స్య‌ను త‌న ప‌రిధిలోకి తీసుకుని దాని వెంట ప‌డుతుంటాడు.

అయితే.. అతని ట్రాక్ రికార్డ్ చూసిన ఉన్నతాధికారి అజిత్ నారాయణ్ (సముతిరకని) అతన్ని ఉత్తరాంధ్రలోని ‘అడవివరం’ అనే ఊరికి పంపిస్తాడు. అక్కడ గంజాయి మాఫియాతో శివుడు (నవీన్ చంద్ర) చేసే అక్రమాలు, లక్ష్మణ్ భేరీ అవి ఎలా అరికట్టాడు అన్నదే అసలు కథ. ఇదిలా ఉండగా అడవివరంలో తులసి (శ్రీలీల)తో హీరోకి ఏర్పడే ప్రేమకథ, దాని వెనుక ఉన్న ట్విస్టులు. ఇవన్నీ సినిమాకు మరో ట్రాక్.

అయితే.. మ‌నం ఇప్ప‌టికే ర‌వితేజ అనేక సినిమాల మాదిరి క‌థ‌నంతోనే సాగుతూ రోటీన్‌గా అనిపిస్తుంది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ర‌వితేజ‌, శ్రీలీల అభిమానులు ఒక్క సారి ట్రై చేయ‌వ‌చ్చు.

Updated Date - Nov 28 , 2025 | 07:56 AM