Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ఇప్పుడు అంతకు మించి

ABN, Publish Date - May 20 , 2025 | 04:47 PM

‘రానా నాయుడు’. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా  నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో...



విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా  నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో రెండో సీజన్‌ (RANA NAIDU 2) ను అంతకు మించి అనేలా రూపొందించారు. ఇప్పుడు  రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

 
 ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13 నుంచి  నెట్ ఫ్లిక్  (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు.   


Updated Date - May 20 , 2025 | 05:07 PM