Chiranjeeva OTT: డైరెక్టు ఓటీటీకి వచ్చేసిన.. మైథలాజికల్ కామెడీ
ABN, Publish Date - Nov 07 , 2025 | 09:53 AM
కాస్త గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన చిరంజీవ (Chiranjeeva) చిత్రం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది.
కాస్త గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన చిరంజీవ (Chiranjeeva) చిత్రం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది. జబర్ధస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న అదిరే అభి (Adire Abhi) ఈ సినిమాకు దర్శకత్వం చేయడం విశేషం. తెలుగమ్మాయి కుషిత కల్లపు (Kushitha Kallapu) కథానాయికగా నటించగా రాజారవింద్ర, టేస్టీ తేజ, రచ్చ రవి, ఇమ్మాన్యుయల్ ఇతర పాత్రల్లో నటించారు. మైథలాజికల్ టచ్‌తో ఔట్ అండ్ ఔట్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. అంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఓ రోజు రోడ్డుపై దున్నపోతును ఢీ కొట్టి ప్రమాదానికి గురౌతాడు. తర్వాతి రోజు నుంచి అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు, అవతలి వారి అయుష్షు ఎన్ని సంవత్సరాలు ఉందనే విషయం శివకు తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలోనే శివ రౌడీ సత్తు పైల్వాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆపై తనకున్న శక్తుల గురించి తెలుసుకున్న శివ వాటిని ఎలా ఉపయోగించుకున్నాడనే పాయింట్ తో పూర్తి హాస్య ప్రధానంగా తెరకెక్కించారు.
తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన యమగోల, యమలీల తరహా ఫాంటసీ కథతో వచ్చిన ఈ సినిమా ఆద్యంతం ఫ్యామిలీని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇప్పుడీ చిరంజీవ (Chiranjeeva) సినిమా ఈ రోజు (నవంబర్ 7) శుక్రవారం నుంచి ఆహా (Aha) ఓటీటీ (OTT) లో ప్రసారం అవుతుంది. ఇంటిల్లిపాది కాసేపు ఈ సినిమా చూసి కాలక్షేపం చేయవచ్చు. ఎక్కడా ఎలాంటా ఇబ్బందికర సన్నివేశాలు లేవు.