Paanch Minar OTT: మొన్ననే థియేటర్లకు.. అప్పుడే ఓటీటీకి! 7 రోజుల్లోనే సడన్‌గా వచ్చేసిన.. రాజ్‌తరుణ్ మూవీ
ABN, Publish Date - Nov 28 , 2025 | 11:59 AM
గతవారం సైలెంట్‌గా థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం పాంచ్ మినార్ 7 రోజుల్లోనే సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది.
గతవారం సైలెంట్‌గా థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం పాంచ్ మినార్ (Paanch Minar). రాజ్ తరుణ్ (Raj Tarun), రాశి సింగ్ (Rashi Singh) జంటగా నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫుల్ కామెడీతో సాగి రిజ్ తరుణ్‌కు చాలాకాలంత తర్వాత మంచి హిట్‌ను అందించింది. అయితే.. ఈ సినిమా థియేటర్‌లో ఉండగానే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సడన్‌గా ప్రేక్షకులకు, సినీ లవర్స్‌కు షాక్ ఇచ్చింది.
ఈజీ మనీ కోసం నిత్యం తాపత్రయ పడుతుంటాడు కృష్ణ చైతన్య ఉరఫ్ కిట్టు (రాజ్ తరుణ్).అయితే అతని ప్రేయసి ఖ్యాతి (రాశీ సింగ్ Rashi Singh) అతనికి పూర్తి భిన్నం. కిట్టును ఎలాగైనా ఒక ఉద్యోగంలో సెట్ చేసి తన తండ్రిని ఒప్పించి వివాహం చేసుకోవాలని ఆశతో ఉంటుంది. అయితే.. కిట్టు తనకు ఉద్యోగం వచ్చిందని ఖ్యాతికి అబద్దం చెప్పి తప్పని పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అంతేగాక ఇన్సెంటివ్‌ల కోసం చెవిటి వాడిగా నటిస్తుంటాడు. అలాంటి సమయంలోనే చోటు (రవివర్మ) అనే వ్యక్తిని చంపడానికి డీల్ కుదుర్చుకున్న ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ చోటును కారు ఎక్కుతారు. ఆపై చోటును చంపాక డడబ్బు అందగానే కిట్టూను చంపేయాలని ఫ్లాన్ చేస్తారు. ఇది తెలుసుకున్న కిట్టు ఎస్పేప్ కాగా అదే సమయంలో కిల్లర్స్ పోలీసులకు పట్టుబడతారు.
ఈ నేపథ్యంలో.. అంతా ఓకే అనుకున్న సమయంలో ఓ పక్క పోలీసులు, కారు ఓనర్, కిల్లర్స్, అంతా కిట్టూని వెతికే పనిలో ఉంటారు. ఈ క్రమంలో కిట్టు వారికి చిక్కాడా, వాళ్లంతా ఎందుకు కిట్టూ వెరకాల పడ్డారు, కిట్టు పెళ్లి అయ్యిందా లేతా అనే ఆసక్తికర కథకథనాలతో సినిమా ఫుల్ ఫన్ రోలర్ కోస్టర్, రైడ్‌గా సాగుతూ వీక్షకులకు మంచి వినోదం అందిస్తుంది. ఇప్పుడు ఈ పాంచ్ మినార్ (Paanch Minar) చిత్రం థియేటర్‌లోకి వచ్చి వారం కాక మునుపే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మంచి కామెడీ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి టైంఫాస్. అజయ్ ఘోష్. నితిన్ ప్రసన్న, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ, పిష్ వెంకట్ పాత్రలు ఆకట్టుకుంటాయి.