సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sister Midnight: స‌డ‌న్‌గా ఓటీటీకి.. బాల‌య్య బ్యూటీ లేటెస్ట్‌ బోల్డ్ మూవీ

ABN, Publish Date - Jun 18 , 2025 | 10:42 AM

ఇటీవ‌లే థియేట‌ర్‌లో విడుద‌లైన ఓ ఢిప‌రెంట్ బ్లాక్ కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రం సిస్ట‌ర్ మిడ్‌నైట్ రెండు వారాల‌కే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆశ్చ‌ర్య ప‌రిచింది.

sister mid night

ఇటీవ‌లే థియేట‌ర్‌లో విడుద‌లైన ఓ ఢిప‌రెంట్ బ్లాక్ కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రం సిస్ట‌ర్ మిడ్‌నైట్ (Sister Midnight) రెండు వారాల‌కే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆశ్చ‌ర్య ప‌రిచింది. లెజండ్‌లో బాల‌య్య స‌ర‌స‌న చేసిన బ్యూటీ రాధికా ఆప్టే, అశోక్ పాఠక్, ఛాయా కదం, స్మితా తాంబే కీలక పాత్ర‌ల్లో న‌టించ‌గా క‌ర‌ణ్ కాందహారి (Karan Kandhari) ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. అమెరిక‌న్స్ అలిస్ట‌ర్ క్లార్క్‌, అన్నా గ్రిఫ్ నిర్మించ‌గా ఇత‌ర అన్ని విభాగాల్లోనూ సంగీతంతో స‌హా అంతా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేయ‌డం విశేషం. మే30న థియేట‌ర్లలోకి వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ స‌రైన ప‌బ్లిసిటీ లేక జ‌నాల‌కు చేర‌లేక ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే క‌నెక్ట్ అయింది. అస‌లు ఇదో సినిమా ఉంద‌ని, రిలీజ్ అయిన సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి వ‌చ్చి షాక్ ఇచ్చింది. కాక‌పోతే ఇక్క‌డో మ‌త‌ల‌బు ఉంది.

స్టోరీ విష‌యానికి వ‌స్తే.. పెద్ద‌లు కుద‌ర్చ‌గా పెళ్లి చేసుకున్న ఓ జంట (ఉమ‌, గోపాల్) ముంబైలోని ఓ స్ల‌మ్‌లో కొత్త‌గా కాపురం పెడ‌తారు. అయితే ఈ వివాహాం ఇష్టం లేని ఉమ భ‌ర్త‌తో అంత‌గా మింగిల్ కాలేక‌పోతుంది. అదే స‌మ‌యంలో ఇంట్రోవ‌ర్ట్ అయిన‌ భ‌ర్త గోపాల్ సైతం భ‌య‌స్తుడిగా ఉంటూ భార్య‌ను చూడ‌డానికి, తాక‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతుంటాడు. దీంతో ఉమ ఏం చేయాలో తెలియ‌క ఓ ఆఫీస్‌లో ఫ్లోర్ క్లీనింగ్ ప‌నిలో చేరుతుంది. ఆయితే భ‌ర్త అంటీ ముట్ట‌న‌ట్లు ఉండ‌డంతో త‌నకు ఉన్న ఆ విప‌రీతమైన వాంఛ‌ను తీర్చుకోలేక బ‌య‌ట‌కి చెప్ప‌కోలేక లోలోన మ‌ద‌న ప‌డిపోతూ అనారోగ్యం పాల‌వుతుంది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి భ‌ర్త‌తో ఆ కార్యం కాస్త పూర్తి చేశాక ప్క్క‌నే పుడున్న భ‌ర‌త్త‌ తెల్లారి లేచి చూసే స‌రికి చ‌నిపోయి ఉంటాడు.దీంతో ఉమ ఏం చేసింది, త‌ర్వాత ఒంట‌రిగా త‌న ప్ర‌యాణం ఎలా సాగింది, ఎన్ని మ‌లుపులు తిరిగింద‌నేదే క‌థ‌.


పూర్తిగా ప్ర‌యోగాత్మంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నిడివి గంటా యాబై నిమిషాలు ఉండ‌గా ఎక్క‌డా ఫ్లాట్లు, స‌బ్ ఫ్లాట్లు లేకుంగా సినిమా అంతా ఇద్ద‌రి ముగ్గురి మ‌ధ్య‌, ఆస్ల‌మ్‌లోనే ఒకే త‌ర‌హాలో స్క్రీన్ ప్లే సాగుతుంది. అయితే ద‌ర్శ‌కుడి టేకింగ్ సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌నీయ‌కుండా సాగుతూ అస‌లు ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఫీల్ ఇస్తుంది. రాధికా అప్టే మ‌రోసారి త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూయించింది. డీ గ్లామ‌ర్ పాత్ర‌లో నిజింగా బ‌స్తీ మ‌హిళ‌గా అంతా సింగిల్ హ్యాండెడ్‌గా మూవీని న‌డిపించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌, గూగుల్‌ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మ‌న ఇండియాలో మాత్రం అందుబాటులో లేకుండా ఇత‌ర అన్ని దేశాల‌లో రెంట్ ప‌ద్ద‌తిలో స్ట్రీమింగ్ అవుతుంది. మ‌న దేశంలో చాలా ఫ్రీ వెబ్ సైట్లో అయితే చూసేయ‌వ‌చ్చు. కానీ సినిమాలో మ‌రీ పచ్చి (బోల్డ్‌) స‌న్నివేశాలు ఉన్నందువల్ల పిల్ల‌ల‌కు, ఫ్యామిలీకి దూరంగా ఈ సిస్ట‌ర్ మిడ్‌నైట్ (Sister Midnight) చిత్రాన్ని చూడ‌డం ఉత్త‌మం.

Updated Date - Jun 18 , 2025 | 12:05 PM