Prime Video: మీ దుంపలు తెగ.. అది ఓటీటీనా, యాడ్ ఏజన్సీనా! ఆ అడ్వర్వటైజ్‌మెంట్లు.. ఏందిరా నాయనా
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:43 PM
కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షకులపై రివేంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టాయి. సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి నుండి యాడ్ ఫ్రీ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేసి కూడా ప్రకటనలను గుప్పిస్తూ తలనొప్పిని తీసుకొస్తున్నాయి. ఓటీటీ సంస్థలు ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ సంగతి ఏమోకానీ.. కొత్త చికాకులు తెప్పిస్తున్నాయి. అసలు ఓటీటీలోకి ఎందుకు వచ్చామా అని వ్యూవర్స్ తలబాదుకునే పరిస్థితి ఎదురౌతోంది.
ఓటీటీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ఇటీవలే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో విడుదలైన రెండు సీజన్లు మంచి ఆదరణ పొందడంతో.. థర్డ్ సీజన్ కోసం వ్యూవర్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. అయితే ప్రైమ్ నిర్వాకంతో ఆసక్తి కాస్త వీక్షకుల్లో కోపానికి దారితీసింది.
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపుదిద్దుకుంది. చాలా పాపులర్ వెబ్ సీరిస్ కావడంతో.. సీజన్‌ను ఒకేసారి చూడాలని వ్యూవర్స్ ఆశపడ్డారు. కానీ మధ్యలో తరచూ వచ్చే యాడ్స్ వారిని బాగా డిస్టర్బ్ చేశాయి. యాభై నిమిషాల ఎపిసోడ్స్ లో ఏకంగా నాలుగు నుండి ఆరు వాణిజ్య ప్రకటనలు రావడంతో వీక్షకులు చికాకు పడ్డారు.
ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రసారం మధ్యలో యాడ్స్ ప్రవేశపెట్టడంతో సబ్‌స్క్రైబర్లు తీవ్రంగా మండి పడుతున్నారు. గతంలో యాడ్ యాడ్స్ ఫ్రీకెన్వీ తక్కువగా ఉండేదని, కానీ నవంబర్ 21 రిలీజ్ అయిన 'ది ఫ్యామిలీ మెన్' సీజన్ 3 తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైందని అంటున్నారు.
భారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించినా యాడ్స్ చూడాల్సి రావడం అన్యాయమని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కొందరైతే... యాడ్ ఫ్రీ ఆప్షన్ లో భాగంగా అదనంగా డబ్బులు కట్టినా... యాడ్స్ వస్తున్నాయని వాపోతున్నారు. ఇదే విషయాన్ని తెలియచేస్తూ సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ ను ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
వినియోగదారులు యాడ్ ఫ్రీ కోసం డబ్బులు కట్టినా... సదరు సంస్థ ఆ ఆప్షన్ ను అప్ డేట్ చేయడం లేదని, అందువల్ల కొన్ని రోజుల పాటు యాడ్స్ ను వాళ్ళు చచ్చినట్టు చూడాల్సి వస్తోందని మరి కొందరు చెబుతున్నారు. మరి ఈ విమర్శలపై ప్రైమ్ వీడియో సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: Priyanka Mohan: తణుకు కపర్దేశ్వర స్వామిని దర్శించుకున్న.. ప్రియాంక మోహన్
Read Also: NTR: దేవర 2 లేనట్టేనా..