సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dude OTT: ఓటీటీకి.. వ‌చ్చేస్తున్న‌ 'డ్యూడ్’! ట్రోలింగ్.. ఏ రేంజ్‌లో ఉంటుందో

ABN, Publish Date - Nov 03 , 2025 | 12:34 PM

యువ న‌ట, ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టించిన నూత‌న చిత్రం 'డ్యూడ్’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

Dude

ఈ యేడు ఇప్ప‌టికే ఎంట‌ర్ ది డ్రాగ‌న్ అంటూ సంచ‌ల‌న విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న యువ న‌ట, ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ (Pradeep ranganathan) న‌టించిన నూత‌న చిత్రం 'డ్యూడ్’ (Dude). తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌మిళంలో నిర్మించిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. కీర్తీశ్వ‌ర‌న్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తూ రూపొందించిన ఈ సినిమా తెలుగులో క‌న్నా త‌మిళ‌నాట మంచి క‌లెక్ష‌న్లు ద‌క్కించుకుంది. కాగా మూవీ స్టోరీ కాస్త కాంప్లికేటేడ్ కావ‌డం విమ‌ర్శ‌లు సైతం గ‌ట్టిగానే మూట‌గ‌ట్టుకుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు ముస్తాబ‌వుతుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. గ‌గ‌న్ త‌న మామ‌య్య అయిన మంత్రి ఆదికేశవులు వ‌ద్దే ఉంటూ ఆయ‌న‌ కూతురు కుంద‌నతో చిన్న నాటి నుంచి క‌లిసి పెరిగి పెద్ద‌వుతారు. ఈ క్ర‌మంలో కుంద‌న గ‌గ‌న్‌ను ప్రేమించి ఆ విష‌యం బ‌య‌ట‌ పెట్ట‌గా అందుకు గ‌గ‌న్ నాకు అలాంటి ఉద్దేశం లేద‌ని చెప్పి ఆమె ప్రేమ‌ను నిరాక‌రిస్తాడు. ఆపై కుంద‌న ఆ ఆ బాధ నుంచి బయట పడటం కోసం బెంగళూరుకు మ‌కాం మారుస్తుంది.

కాల క్ర‌మంలో అక్క‌డ మ‌రో అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే.. కుంద‌న వెళ్లిపోయాక త‌న ప్రేమ గురించి అర్థం చేసుకున్న గ‌గ‌న్ విష‌యం మామ‌య్య దృష్టికి తీసుకెళ్ల‌గా పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడు. తండ్రి మాట కాద‌న‌లేక కుంద‌న పెళ్లి చేసుకుంటుంది. ఆనంత‌రం కుంద‌న ప్రేమ వ్య‌వ‌హారం తెలిసిన గ‌గ‌న్ ఏం చేశాడు అనేది క‌థ‌.

ఇలాంటి సినిమాలు ఇప్ప‌టికే చాలా వ‌చ్చి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌దీప్ ఎన‌ర్జీ, మ‌మితా బైజు (Mamitha Bajju) క్రేజ్‌ సినిమాకు కొత్త రూపు తీసుకువ‌చ్చాయి. మేక‌ర్స్ ట‌చ్ చేసిన పాయింట్ చాలా మందికి జీర్ణం కావ‌డం చాలా క‌ష్టం. థియేట‌ర్‌లో విడుద‌లైన ఈ సినిమాకు అనేక ప్రాంతాల నుంచి విమ‌ర్శ‌లు రాగా రేపు ఓటీటీకి వ‌స్తే ప‌రిస్థి మ‌రింత రెట్టింపు అయ్యే అవ‌కాశాలు అధికంగానే ఉన్నాయి. ఈ 'డ్యూడ్’ (Dude) సినిమా న‌వంబ‌ర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో త‌మిళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది. అయితే ఈ సినిమా ఓ గ్రూప్ వారికి మాత్ర‌మే క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం ఉంది.

Updated Date - Nov 03 , 2025 | 12:39 PM