సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dude OTT: 'డ్యూడ్‌’.. ఓటీటీకి వ‌చ్చేసింది! ట్రోల‌ర్స్‌కు.. ఇక పండుగే పండుగ‌

ABN, Publish Date - Nov 14 , 2025 | 05:18 AM

గ‌త నెల‌లో దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు ఎదుట‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకున్న చిత్రం డ్యూడ్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది..

Dude

గ‌త నెల‌లో దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు ఎదుట‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకున్న చిత్రం డ్యూడ్ (Dude ). ప్ర‌దీప్ రంగ‌నాధ‌న్ (Pradeep Ranganathan), మ‌మితా బైజు (Mamitha Baiju) లీడ్ రోల్స్‌లో న‌టించ‌గా శ‌ర‌త్‌ కుమార్‌, నేహా శెట్టి, ఐశ్వ‌ర్యా శ‌ర్మ కీల‌క పాత్ర‌లు చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌గా కీర్తీశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే థియేట‌ర్ల‌కు వ‌చ్చి కాస్త ఎక్కువ‌గా నెగిటావ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి ఆశ్య‌ర్య ప‌రిచింది. ఇప్పుడీ ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. మంత్రి ఆదికేశవుల మేనల్లుడు అయిన గగన్ (ప్రదీప్) త‌న మామ కూతురు, కుందన (మమితా) చిన్నప్పటి క‌లిసి పెరుగుతారు. పెద్ద‌య్యాక కుంద‌న త‌న ప్రేమ‌ను వ్య‌క్త ప‌ర్చ‌గా గగన్ తిరస్కరిస్తాడు. బాధతో బెంగళూరు వెళ్లిన కుందన కొన్నాళ్ల త‌ర్వాత‌ కొత్త వ్యక్తి పార్థును ప్రేమిస్తుంది. అదే సమయంలో గగన్ తాను చేసిన పొర‌పాటు తెలుసుకుంటాడు. కుందనను ప్రేమిస్తున్న‌ట్లు అర్థం చేసుకుని త‌న మామ‌కు చెప్పగా పెళ్లికి అంతా సిద్ధం చేస్తాడు. కానీ తండ్రి మాట మాటను దిక్కరించలేక పెళ్లి పీటలెక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గగన్ చేసిన త్యాగం ఏంటి? చివరకు ఏం జరిగిందన్నదే కథ.

మ‌నం ఇదివ‌ర‌కు చూసిన చాలా సినిమాల క‌థ‌లానే ఉన్నా చిన్నప్పటి ప్రేమ, కుటుంబ గొడవలు, పరువు హత్యలు ఇవన్నీ ఎన్నోసార్లు చూసినవే. కానీ ప్రదీప్ ఎనర్జీ, దర్శకుడి నరేషన్ ఈ రొటీన్ కథకి ఫన్ టచ్ ఇచ్చాయి. ఫస్ట్ హాఫ్ లైట్ హార్టెడ్ రొమాన్స్, ఎంటర్టైన్‌మెంట్‌తో సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ ‘ఆర్య’ వైబ్ను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు లాజిక్ కి దూరంగా ఉన్నా, ఫన్ ఎమోషన్ మిక్స్ బాగుంది.

క్లైమాక్స్ సీరియస్ టాపిక్‌కీ చిన్న హ్యూమర్‌తో నడిపించడం ప్లస్ పాయింట్. కొన్ని సీన్లు డెజా-వూ అనిపించినా.. యూత్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ఫన్ ఎలిమెంట్స్ ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా సినిమాని న‌డిపిస్తాయి. ఇప్పుడీ చిత్ర నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగు, త‌మిల భాష‌ళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు చూడ‌వ‌చ్చు. కానీ సంస్కృతి, సాంప్ర‌దాయాలు, హిందూత్వం ఫాలో అయ్యేవారు ఈ చిత్రానికి దూరంగా ఉండ‌డం మంచిది.

Updated Date - Nov 14 , 2025 | 05:18 AM