Akkada Ammayi Ikkada Abbayi OTT: అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి.. వచ్చేస్తున్నారు! స్ట్రీమింగ్.. ఆ ఓటీటీలో
ABN , Publish Date - May 04 , 2025 | 09:40 AM
30 రొజుల్లో ప్రేమించడం ఎలా వంటి హిట్ చిత్రం తర్వాత మలి ప్రయత్నంగా ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన రెండో చిత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. ఇప్పుడు ఈ సినిమా డిజటిల్ స్ట్రీ మింగ్‌కు రెడీ అయింది.
30 రొజుల్లో ప్రేమించడం ఎలా వంటి హిట్ చిత్రం తర్వాత మలి ప్రయత్నంగా ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా నటించిన రెండో చిత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (Akkada Ammayi Ikkada Abbayi). ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది. గతంలో ఈటీవీలో చాలీ ఈవెంట్లకు, షోలకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్‌లు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. మరో టీవీ స్టార్ దీపికా పిల్లి (Deepika Pilli) కథానాయికగా నటించగా జాన్ విజయ్, రోహిణి, గెటప్ శ్రీను, సత్య కీతక పాత్రలు చేశారు. రాడాన్ (Radhan) సంగీతం అందించాడు. ఇప్పుడు ఈ సినిమా డిజటిల్ స్ట్రీ మింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ లో ఉండే ఓ గ్రామంలో కొన్ని సంవవత్సరాల పాటు తీవ్ర కరువు కాటకాలు సంభవించడంతో పాటు అందరి ఇళ్ళలో అబ్బాయిలే పుడతారు. కొంత కాలం తర్వాత ఓ ఇంట ఆడపిల్ల జన్మించిన అనంతరం ఆ ఊరి సమస్యలన్ని తీరి సుభిక్షంగా మారుతోంది. దీంతో ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయి ఈ ఊరు దాటి వెళ్లవద్దని, అప్పటికే వయసులో ఉన్న 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్ళాడితే తన మొత్తం ఆస్తితో పాటు మనుసుబు గిరీ కూడా కట్టబెడతానని చెబుతాడు. అంతుకు అ అమ్మాయి తండ్రి కూడా ఒప్పుకుంటాడు. కాలక్రమంలో పెరిగి యుక్త వయసుకు వచ్చిన ఆ అమ్మాయి (దీపిక పిల్లి) ఆ ఊరికి ఇంజనీరుగా వచ్చిన ప్రదీప్ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ ఫలించాలంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిలకు పెళ్లి చేసి తర్వాత వారిద్దరూ పెళ్లాడాలని తీర్మానం చేస్తారు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ ఏం చేస్తాడు? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తాడనేదే ఈ సినిమా కథ.
ఈ సినిమాకు ప్రధాన బలం సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌ల కామెడీ. చాలా సన్నివేశాల్లో వీరి హస్యం నవ్వులు పూయిస్తుంది. కొన్ని సందర్భాల్లో ల్యాగ్, రోటీన్ అనిపించిన కాసేపు కాలక్షపానికి సినిమాను ఎంచక్కా చూసేయవచ్చు. ఇప్పుడు ఈ సినిమా మే 08 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సయిన వారు ఎంచక్కా ఇంటి వద్దే ఈ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.