Akkada Ammayi Ikkada Abbayi OTT: ఓటీటీకి వచ్చేసిన.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి! ఇక్కడ చూసేయండి
ABN, Publish Date - May 08 , 2025 | 09:46 AM
ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నెల రోజుల లోపే డిజటిల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi). ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) హీరోగా నటించగా దీపికా పిల్లి (Deepika Pilli) కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుని పరవాలేదనిపించుకుంది. గతంలో ఈటీవీలో ఈవెంట్లు, రియాలిటీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్‌లు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. జాన్ విజయ్, రోహిణి, గెటప్ శ్రీను, సత్య కీతక పాత్రలు చేశారు. రదాన్ (Radhan) సంగీతం అందించాడు. ఇప్పుడు ఈ సినిమా నెల రోజుల లోపే డిజటిల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. ఆంధ్రా తమిళనాడు బోర్డర్ లోని ఓ గ్రామంలో కొన్ని సంవవత్సరాలు తీవ్ర కరువు వస్తుంది. అంతేకాదు ఆ ఊరి అందరి కుటుంబాలలో కేవలం అబ్బాయిలే పుడుతూ ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఓ ఇంట అనుకోకుండా ఆడపిల్ల జన్మిస్తుంది. అదే సందర్భంలోఆ ఊరి సమస్యలన్ని తీరి సుభిక్షంగా మారడంతో ఆ అమ్మాయిని పెద్దయ్యాక కూడా ఊరు దాటి వెళ్లనీయొద్దని ఆ ఊరి పెద్దమనిషి ఆదేశిస్తాడు. ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చాక ఊరిలో ఉన్న 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్ళాడితే తన మొత్తం ఆస్తితో పాటు మనుసుబు గిరీ కూడా కట్టబెడతానని హమీ ఇస్తాడు.
కాలక్రమంలో పెరిగి పెళ్లీడుకు వచ్చిన ఆ అమ్మాయి (దీపిక పిల్లి) ఆ ఊరికి ఇంజనీరుగా వచ్చిన ప్రదీప్ ప్రేమలో పడుతుంది. ఈ విషయం ఊర్తో తెలిసి వారి ప్రేమ ఫలించాలంటే అప్పటికే గ్రామంలోని 60 మంది అబ్బాయిలకు పెళ్లి చేయాలని తీర్మానం చేస్తారు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ ఏం చేశాడు? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? ఆ జంట ఎలా ఒకటయ్యారనే ఆసక్తికరమైన కథకథనాలతో హస్యం పంచుతూ సినిమా సాగుతుంది..
ఈ సినిమాకు ప్రధాన బలం సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌ల కామెడీ. చాలా సన్నివేశాల్లో వీరి హస్యం నవ్వులు పూయిస్తుంది. కొన్ని సందర్భాల్లో ల్యాగ్, రోటీన్ అనిపించిన కాసేపు కాలక్షపానికి సినిమాను ఎంచక్కా చూసేయవచ్చు. సందీప్ బొల్లా మాటలు అక్కడక్కడా ఎంటర్ టైన్ చేస్తాయి. ఇప్పుడు ఈ సినిమా ఈ రోజు గురువారం (మే 08) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సయిన వారు, కాస్త కామెడీ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్సన్, ఎంచక్కా ఇంటి వద్దే ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.