సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG OTT: ఓజెస్ గంభీర.. ఓటీటీకి వ‌చ్చేశాడు! ఇక ర‌చ్చ ర‌చ్చే

ABN, Publish Date - Oct 23 , 2025 | 08:42 AM

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (OG) డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చి మరోసారి హల్‌చల్ చేస్తోంది.

OG

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన మొదటి సినిమా హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. దాంతో అంతా తీవ్ర నిరాశ‌లో ఉన్న స‌మ‌యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఎదురుచూసిన సినిమా ఓజీ (OG) మాత్రం ఆ అంచనాలను నెరవేర్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చి మరోసారి హల్‌చల్ చేస్తోంది.

కథ ఏంటంటే.. జపాన్‌లో జరిగిన ఒక దాడి తర్వాత భారతదేశానికి వచ్చి, ముంబై అండర్‌వ‌ర‌ల్డ్‌లో అడుగుపెట్టే ఓజెస్ గంభీర్‌ (పవన్ కళ్యాణ్) అక్క‌డ‌ మాఫియా ప్రపంచాన్ని ఎలా అదుపులోకి తీసుకు వ‌చ్చాడనేది కథ. సత్యాదాదా (ప్రకాశ్ రాజ్) అనే డాన్‌కు ఓజీ కుడిభుజంగా మారడం, అప్పుడు జరిగే పరిణామాలు, తర్వాత అతడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు, మళ్లీ ఎందుకు తిరిగి వచ్చి ఏం చేశాడ‌నేది క‌థ‌.

ముంబై అండర్‌వ‌ర‌ల్డ్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినా, సుజీత్ త‌న‌దైన స్టైల్‌ స్క్రీన్‌ప్లేతో యాక్షన్‌, ఎమోషన్‌, ఫ్యామిలీ డ్రామాఈ మూడింటి మేళవించి ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేశాడు. పవన్ కళ్యాణ్‌ ఎంట్రీ ఆలస్యమైనా, ప్రతి సీన్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్‌లో ‘జానీ’ పేరుతో వచ్చే ట్విస్ట్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఖాయం. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్ సీన్స్ పవర్ స్టార్‌ స్టైల్లో ఉన్నాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కొంచెం హింస ఎక్కువగా అనిపించినా, మాస్ ప్రేక్షకులకు ఇది పక్కా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్. దసరా సీజన్‌కి థియేటర్లలో రచ్చ చేసిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఇప్పుడే చూసేయండి.

Updated Date - Oct 23 , 2025 | 08:57 AM