Frankenstein: గిల్లెర్మో .. హర్రర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 03 , 2025 | 01:27 PM
గిల్లెర్మో డెల్ టోరో (Guillermo del Toro) కాస్త విరామం అనంతరం తెరకెక్కించిన చిత్రం ఫ్రాంకెన్‌స్టైన్.
ప్రపంచ సినీ ప్రేమికులకు హారర్ జానర్‌లో తరుచూ కొత్తదనాన్ని చూపిస్తూ అద్భుతమైన విజువల్స్ తో గ్లోబల్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గిల్లెర్మో డెల్ టోరో (Guillermo del Toro) కాస్త విరామం అనంతరం తెరకెక్కించిన చిత్రం ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein). విశ్వ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన మెరీ షెల్లీ రచించిన క్లాసిక్ నవల ఫ్రాంకెన్‌స్టైన్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా నిర్మిస్తుండడం విశేషం.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయగా అది చూసిన వారు ఆ విజువల్స్‌కు, భయానక సన్నివేశాలు కట్టి పడేసేలా ఉన్నాయి. నవంబర్ 7 నుంచి స్టెయిట్‌గా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. ఆస్కార్ ఐజాక్ (Oscar Isaac), జాకబ్ ఎలోర్డి, మియా గోత్, ఫెలిక్స్ కమ్మరర్, చార్లెస్ డ్యాన్స్చ క్రిస్టోఫ్ వాల్ట్జ్ వంటి పేరున్న నటులు ఈ చిత్రంలో నటించడం విశేషం.