Thunderbolts OTT: ఓటీటీకి వచ్చిన.. 400 మిలియన్ డాలర్ల సినిమా! ఎందులో అంటే
ABN, Publish Date - Jul 01 , 2025 | 08:30 PM
రెండు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం థండర్ బోల్ట్స్.
రెండు నెలల క్రితం మే2న నాని హిట్3. రెట్రో వంటి ఇండియన్ సినిమాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం థండర్ బోల్ట్స్ (Thunderbolts). మార్వెల్ సూపర్ మీరోస్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమాకు జేక్ ష్రియర్ ( Jake Schreier) దర్శకత్వం వహించగా ఫ్లోరెన్స్ పగ్ (Florence Pugh), సెబాస్టియన్ స్టాన్, వ్యాట్ రస్సెల్, ఓల్గా కురిలెంకో, లూయిస్ పుల్మాన్, జెరాల్డిన్ విశ్వనాథన్, క్రిస్ బాయర్, వెండెల్ పియర్స్, డేవిడ్ హార్బర్, హన్నా జాన్-కామెన్, జూలియా లూయిస్-డ్రేఫస్ కీలక పాత్రల్లో నటించారు. అయితే రిలీజ్‌కు ఒకట్రెండు రోజులు ముందు ఈ సినిమా పేరును న్యూ అవెంజర్స్ అంటూ మార్చి మేకర్స్ షాకిచ్చారు.
సుమారు 180 మిలియన్ డాలర్లతో నిర్మితమైన ఈ మూవీ దాదాపు 400 మిలియన్ డాలర్లను రాబట్టి ఈ యేడు హాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాలలో టాప్ టెన్‌లో ఆరో స్థానం సంపాదించుకోవడం విశేషం. అయితే రిలీజైన రెండు నెలల తర్వాత ఇప్పుడీ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సినీ లవర్స్‌ను ఆశ్చర్య పరిచింది. కథ విషయానికి వస్తే.. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు ఎలీనా, వాకర్, కోచ్, ఘోస్ట్ నలుగురితో కలిపి థండర్ బోల్ట్స్ టీమ్‌ను రెడీ చేస్తుంది వాలంటీనా. అయితే మనుషులను నీడలుగా మార్చి అమెరికా మొత్తాన్ని ఆడుకుంఉటన్న డార్క్ విజన్ బాబ్‌ను ఈ కొత్త అవెంజర్స్ ఎలా ఎదుర్కొన్నారు, బాబ్ స్టోరీ ఎంటనే ఆసక్తికరమైన కథనంతో సినిమా సాగుతుంది.
గత మార్వెల్ సినిమాల్లో విలన్ల మాదిరి పాత్రల్లో నటించిన వారిని ఈ సినిమా నుంచి సూపర్ హీరోస్‌గా మార్చారు. అంతేగాక నాటి చిత్రాలకు కాస్త భిన్నంగా అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్లతో రూపొందించారు. ఇప్పుడీ థండర్ బోల్ట్స్ (Thunderbolts) చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ (Amazon Prime Video) లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటికైతే ఈ మూవీ కేవలం అమెరికాలో మాత్రమే సస్ట్రీమింగ్ అవుతోంది. మరో వారం తర్వాతే ఇండియాలోని ఓటీటల్లో సందడి చేయనుంది. కాక పోతే ప్రస్తుతం కొన్ని ఫ్రీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వారు అక్కడ చూసేయవచ్చు.