Special Ops .. హిమ్మత్ సింగ్ వచ్చేస్తున్నాడు! టీజర్ రిలీజ్
ABN , Publish Date - May 16 , 2025 | 10:23 AM
ఐదేండ్ల క్రితం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చి మంచి విజయం సాధించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ సెకండ్ సీజన్ టీజర్ తాజాగా విడుదల చేశారు.
ఐదేండ్ల క్రితం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చి మంచి విజయం సాధించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ (Special Ops). కేకే మీనన్ (Kay Kay Menon), కరణ్ టాకర్, వినయ్ పాఠక్, విపుల్ గప్తా, సనాఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఏ వెడ్నస్ డే, ధోని, బేబీ, స్పెషల్ 26 వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్తవం వహించన నీరజ్ పాండే (Neeraj Pandey) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌లో సెకండ్ సీజన్ ముస్తాబవుతుంది. ఈక్రమంలో తాజాగా ఇందుకు సంబంధించి టీజర్ విడుదల చేశారు. త్వరలోనే జియో హాట్‌స్టార్ (JioHotstar )లో డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ టీజర్‌ను చూస్తే మొదటి భౄగాన్ని మించి సెకండ్ పార్ట్‌ను తెరకెక్కించినట్లు కనిపించడంతో పాటు ఓ భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమా స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉండనున్నట్లు అర్థమవుతుంది. ఈ సారి ప్రకాశ్ రాజ్ పాత్ర ఎంట్రీ ఇస్తుండడం విశేషం.