సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Eleven OTT: ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా! డోంట్ మిస్‌

ABN, Publish Date - Jun 13 , 2025 | 07:53 AM

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌.

11

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ థ్రిల్ల‌ర్ సినిమాలంటే త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra). ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రం ఎలెవ‌న్ (Eleven) గ‌త నెల‌లో.. మే16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో మ‌స్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాలో రేయ హ‌రి (Reyaa Hari), అభిరామి (Abhirami) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుంద‌ర్ సీ వ‌ద్ద అనేక సినిమాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అరవింద్‌ (నవీన్‌ చంద్ర) విశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా, స్మార్ట్‌ పోలీసుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడు. అయితే నగరంలో జ‌రుగుతున్న వరుస హత్యల కేసుని డీల్‌ చేస్తున్న పోలీస్‌ అధికారి రంజిత్‌ (శశాంక్‌) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్య‌త‌ అరవింద్‌ తీసుకుంటాడు. ఆపై కూడా వ‌రుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంత‌కీ ల‌భించ‌వు. ఈ క్ర‌మంలో చివ‌ర‌కు ఆరో హ‌త్య‌ దగ్గర ల‌భించిన‌ ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్క‌రిగా హత్యకు గురైన వాళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. కానీ హత్యలు చేసేది ఎవరనే విష‌యం మాత్రం తెలియ‌దు. చివ‌ర‌కు అరవింద్ ఏం చేశాడు. హంతుకుడిని పట్టుకో గ‌లిగాడా? లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి? ట్విన్‌ బర్డ్‌ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ కథలో బెంజిమన్‌ పాల్‌, ఫ్రాన్సిస్‌ ఎవరు? అన్నది కథ.

సినిమా ఆరంభమైన 10 నిమిషాల‌లోనే ఇన్వెస్టిగేష‌న్ మొద‌లై.. ప్రేక్ష‌కులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం స‌స్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. అంతేగాక సీరియ‌ల్ కిల్ల‌ర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేస్తుంది.మ‌రి కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు సైతం ఆక‌ట్టుకుంటాయి. ఇక ఫ్రీ ఇంట‌ర్వెల్‌కు ముందే కిల్ల‌ర్ బ‌య‌ట‌ప‌డ్డప్ప‌టికీ చివ‌ర్లో వ‌చ్చే ట్విస్టు సైతం గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటుంది.

ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మ‌రో మూడు ఓటీటీల్లో (ఆహా త‌మిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్‌) స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి థ్రిల్ల‌ర్ చిత్రం చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఎలెవ‌న్ (Eleven) సినిమాను మిస్ అవ‌కుండా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇదిలాఉంటే న‌వీన్ చంద్ర న‌టించిన మ‌రో థ్రిల్ల‌ర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుద‌ల రోజే థియేట‌ర్ల‌లోకి రాగా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ కూడా ఓకే రోజు రావ‌డ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jun 13 , 2025 | 07:58 AM