Sundarakanda OTT: నారా రోహిత్.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ఓటీటీకి వచ్చేసింది! ఫ్యామిలీస్‌కు ఫుల్ టైంఫాస్
ABN, Publish Date - Sep 23 , 2025 | 07:19 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని విజయం సాధించిన చిత్రం సుందరాకాండ ఓటీటీకి వచ్చేసింది.
గత నెలలో థియేటర్లకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని విజయం సాధించిన చిత్రం సుందరాకాండ (Sundarakanda). నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటించగా విర్తి వాఘని (Virti Vaghani), ఈశ్వర్ శ్రీదేవి (Sridevi Vijay Kumar) హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సీనియర్ నరేశ్ (Naresh Vijaya Krishna), వాసుకీ, సత్య (Sathya), అభినవ్ (Abhinav), సునయన (Sunaina) వంటి నటులు ప్రధాన పాత్రలు చేశారు. ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హీరోయిన్ విర్తి వాఘని (Virti Vaghani) కొత్తగా ఉండి తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తన డ్రెస్సింగ్, డ్రెస్సులు సైతం సరికొత్తగా ఉండి ఇట్టే ఆకర్షిస్తాయి.
కథ ఏంటంటే.. వయసు మీద పడుతున్నా ఇంకా పెళ్లి కానీ సిద్థార్థ్ తనకు నచ్చిన 5 క్వాలిటీలు ఉన్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఏండ్లకు ఏళ్లు కాలం వెళ్లదీస్తాడు. ఇక ఓపిక పట్టలేక అమెరికా వెళ్లి పోవాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఐరా అనే యువతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో తన ట్రిప్పు క్యాన్సిల్ చేసి అ అమ్మాయి ప్రేమ పొందేందుకు ఆమె చదివే కాలేజీలోనే లెక్చరర్‌గా చేరి ఐరా ప్రేమను పొంది పెళ్లికి సిద్ధమవుతాడు. ఈ విషం చెప్పి పెళ్లి సంబంధం కుదుర్చుకుందామని వెళ్లగా తీను చిన్నతనంలో ప్రేమించి, ఆరాధించిన వైష్ణవినే ఐరా తల్లి అనే షాకింగ్ విషయం తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. సిద్థార్థ్ ఏం చేశాడు, వైష్ణవిని ఒప్పించగలిగాడా, ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అసలు విషయం తెలిసిన వైష్ణవి ఏం చేసింది, చివరకు వారి పెళ్లి జరిగిందా లేదా, అంత బాగుంది ఇక నెక్ట్స్ పెళ్లే అనుకునే సమయంలో ఐరా ఇచ్చిన షాకేంటి అనే కథ కథనాలతో సినిమా సాఫ్ట్‌గా సాగుతూ చూసే వారికి ఫస్ట్ నుంచి చివరి వరకు బ్యూటీఫుల్ ఫీల్ ఇస్తుంది. ఎక్కడా బోర్ అనేది రాకుండా త్రివిక్రమ్ స్టైల్ రైటింగ్‌తో, ముఖంపై నవ్వు మిస్సవకుండా సాగుతుంది. సత్య, అభినవ్‌లు సినిమా అసాంతం కనిపిప్తూ మంచి కామెడీతో అలరిస్తారు. ఎక్కడా కించత్ అసభ్యత, వల్గారిటీ, అశ్లీలత అనేవి ఏవీ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సుందరాకాండ (Sundarakanda) చిత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, ఇంటిల్లి పాది కుటుంబంతో సినిమా చూడాలనుకునే వారికి ఈ మూవీ మంచి ఆఫ్సన్.