సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HIT3 OTT: ఆ ఓటీటీకి నాని హిట్‌3.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే....

ABN, Publish Date - May 24 , 2025 | 11:37 AM

నాని హీరోగా, శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హిట్ యూనివ‌ర్స్‌లో మే1 థియేట‌ర్లలోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం హిట్‌3.

HIT3

నాని (Nani) హీరోగా, శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌వంత‌మైన‌ హిట్ యూనివ‌ర్స్‌లో భాగంగా మే1 గురువారం రోజున‌ ప్ర‌పంచ‌ వ్యాప్తంగా థియేట‌ర్లలోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం హిట్‌3 (HIT 3). సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇటీవ‌లే రూ.100 కోట్లకు పైగా వ‌సూల్లు రాబట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ జాబితాలో చేరింది. సినిమా విడుద‌లై పాతిక రోజుల‌వుతున్నా థియేట‌ర్ల‌ల‌లో మంచి వ‌సూళ్లే సాధిస్తున్న ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్‌లో ఎస్పీగా ఉంటాడు. అయితే వేర్వేరు ప్రదేశాలలో భిన్న వ్యక్తులు ఒకేలా రెండు హత్యలు చేస్తారు. వాటిల్లోని సారూప్యత అర్జున్ సర్కార్‌ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులను ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల ల‌క్ష్యం ఏంటీ? వాళ్ళు ఎందుకింత క్రూరంగా మనుషులను చంపుతున్నారు? అనే దానిపై తన అసిస్టెంట్స్ వర్ష (కోమలి ప్రసాద్ Komali Prasad), దివాకర్ (చైతు జొన్నలగడ్డ Chaithu Jonnalagadda) సాయంతో బాస్ నాగేశ్వరరావు (రావు రమేశ్‌ Rao Ramesh) కనుసన్నలలో ఈ ఆపరేషన్ ను టేకప్ చేస్తాడు. ఈక్ర‌మంలో అర్జున్‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి, అర్జున్ వారి ఆటలను ఎలా కట్టించాడు? మృదుల (శ్రీనిధి శెట్టి Srinidhi Setty) ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయింది. చివ‌ర‌కు ఏం చేశార‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

ఎప్పుటిక‌ప్పుడు డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ విజ‌యాలు సాధిస్తున్న హీరో నాని ప్రస్తుతం త‌న‌కు ఉన్న‌ సాఫ్ట్ ఇమేజ్ చట్రం నుంచి బయట పడ‌డానికి చేసిన ఈ ప్ర‌య‌త్నం బాగానే ఉన్నా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు సినిమా కాస్త దూరం అయింది. మూవీలో అర్జున్ సర్కార్ ఊచకోతకు అంతులేకుండా పోయింది. దాదాపు ఇరవై ఐదు నిమిషాలు సాగే ఈ ఎపిసోడ్ రెగ్యులర్ మూవీ ల‌వ‌ర్స్ ఎంత వరకూ తట్టుకుంటారనేది సందేహమే. ఇప్పుడీ సినిమా మే 29 నుంచి అంటే మ‌రో ఐదు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ‌నుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, సినిమాను మ‌ళ్లీ చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎంచ‌క్కా ఇంటివ‌ద్దే చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. అయితే సున్నిత మ‌న‌స్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండ‌డం ఉత్త‌మం.

Updated Date - May 24 , 2025 | 01:01 PM