Mystery: ఓటీటీలో.. ఆకట్టుకుంటున్న ‘మిస్టరీ’
ABN, Publish Date - Nov 08 , 2025 | 06:55 PM
‘మిస్టరీ’ అనే చిత్రం ఆహా ఓటిటిలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.
పి.వి. ఆర్ట్స్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లపై రూపొందిన ‘మిస్టరీ’ సినిమా నవంబర్ 7న ఆహా ఓటిటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా లక్షల్లో వ్యూస్ సాధించి మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించగా, నిర్మాతలుగా వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్ పనిచేశారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు సరదా కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది.
ఈ సందర్భంగా.. దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైంది. మా టీమ్ అందరూ అద్భుతంగా పని చేశారు.
ముఖ్యంగా తనికెళ్ల భరణి, సుమన్, అలీ, జబర్దస్త్ సత్య, ఆకెళ్ల, గడ్డం నవీన్, రవి రెడ్డి, వెంకట్ పులగం వంటి కళాకారులు తమ తమ పాత్రల్లో ప్రాణం పోశారు అన్నారు.
ఇక హీరోయిన్ స్వప్న చౌదరి ఈ సినిమాలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో పాటు హ్యూమరస్ టచ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.