సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hridayapoorvam: ఓటీటీలో.. అద‌ర‌గొడుతున్న మ‌ల‌యాళ‌ లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా

ABN, Publish Date - Sep 28 , 2025 | 04:53 PM

వ‌రుస సినిమాలు, బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాలతో సంచ‌ల‌నాలు సృష్టిస్తోన్న‌ మోహ‌న్‌లాల్ న‌టించిన నూత‌న చిత్రం హృద‌య పూర్వం.

Hridayapoorvam

ఈ సంవ‌త్స‌రం వ‌రుస సినిమాలు, బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాలతో సంచ‌ల‌నాలు సృష్టిస్తోన్న‌ మోహ‌న్‌లాల్ (Mohanlal) క‌థానాయ‌కుడిగా న‌టించిన నూత‌న చిత్రం హృద‌య పూర్వం (Hridayapoorvam) . గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల నుంచి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని భారీ స‌క్సెస్ సాధించింది. తుడ‌రుం, ఎంపురాన్ త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడో బ్లాక్బ‌స్ట‌ర్ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఇప్పుడీ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రాగా ప్రేక్ష‌కుల నుంచి అదిరే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మాళ‌విక మోహ‌న‌న్ (Malavika Mohanan), సంగీత్ ప్ర‌తాప్ (Sangeeth Prathap), సంగీత మాద‌వ‌న్ నాయ‌ర్ (Sangita Madhavan Nair) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. క్లౌడ్ కిచెన్ న‌డిపించుకునే సందీప్‌కు వ‌య‌సు మీద ప‌డినా పెళ్లి అవ‌దు. త‌న గురించి ఆలోచించే వారు కుండా ఉండ‌రు ఒంట‌రిగా ఫీల‌వుతూ ఉంటుంటాడు. ఇదిలా ఉండ‌గానే ఓ రోజు స‌డ‌న్‌గా హ‌ర్ట్ ఇష్యూ రావ‌డంతో అదే స‌మ‌యంలో బ్రెయిన్ డెడ్ అయిన పూణెకి చెందిన ఓ రిటైర్డ్ క‌ల్న‌ల్ గుండెను సందీప్‌కు అమ‌రుస్తారు. ఆపై సందీప్‌కు స‌హాయ‌కుడిగా ఓ మేల్ న‌ర్సుని ఏర్పాటు చేస్తారు. కొన్ని నెల‌ల త‌ర్వాత క‌ల్న‌ల్ కూతురు హ‌రిత‌ త‌న తండ్రి జ్ఞాప‌కాల‌ను మ‌రువ‌లేక అత‌ని గుండె ఉన్న సందీప్‌ను త‌న ఎంగేజ్‌మెంట్‌కు రావాల‌ని ఆహ్వానిస్తుంది. రెండు రోజుల కోస‌మ‌ని అక్క‌డికి వెళ్లిన సందీప్ అనుకోకుండా నెల రోజులు ఉండాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది.

ఈ నేప‌థ్యంలో.. హ‌రిత త‌న త‌ల్లితో అక్క‌డి వారంద‌రితో క‌లిసి పోవ‌డం, వాళ్ల‌కున్న చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను తీరుస్తూ త‌న‌కు ఏం కావాలో, ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటాడు. ఈ క్ర‌మంలో హ‌రిత పెళ్లి ఏమైంది, అత‌ని ప్ర‌యాణం ఎన్ని అనుభూతుల‌ను మిగిల్చింది అనే పాయింట్‌తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ చూడ‌ని వారు, అస‌లు తెలియ‌ని వారు ఇప్పుడే ఆల‌స్యం చేయ‌కుండా ఈ హృద‌య పూర్వం (Hridayapoorvam) సినిమా చూసేయండి. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల‌తల‌కు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌గా సింఫుల్ హ్యుమ‌ర్ ట‌చ్‌తో మూవీ సాగుతుంది.

Updated Date - Sep 28 , 2025 | 04:53 PM