Thunderbolts: థండర్ బోల్ట్స్ (న్యూ అవేంజర్స్).. ఓటీటీకి వచ్చేశారు! నాడు విలన్లు.. నేటి హీరోలైతే
ABN, Publish Date - Aug 27 , 2025 | 07:49 AM
మూడు నెలల క్రితం థియేటర్లకు వచ్చిన హాలీవుడ్ చిత్రం థండర్ బోల్ట్స్, న్యూ అవేంజర్స్ ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మార్వెల్ సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే తరహాలో మే 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన థండర్ బోల్ట్స్ (Thunderbolts) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సూపర్‌హిట్ మూవీ ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముందు నుంచి ఉన్న పేరుతో కాకుండా రిలీజ్ రోజు నుంచి న్యూ అవేంజర్స్ (New Avengers) అనే కొత్త టైటిల్‌తో అభిమానులను ఆశ్చర్య పరిచింది.
ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వాయట్ రస్సెల్, జూలియా లూయిస్-డ్రెఫస్ వంటి హాలీవుడ్ స్టార్ నటులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే.. సుమారు $180 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $382 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది హాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో 6వ స్థానం సాధించడం విశేషం.
కథవిషయానికి వస్తే.. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా కొత్త టీమ్ “థండర్ బోల్ట్స్”ని రెడీ చేస్తుంది. దీంతో యెలీనా, వాకర్, కోచ్, ఘోస్ట్‌లతో కలిసి కొత్త మిషన్‌లోకి అడుగు పెడతారు. అదే సమయంలో అమెరికా మొత్తాన్ని నీడలుగా మార్చి తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించిన డార్క్ విజన్ బాబ్‌ను ఈ కొత్త టీమ్ ఎలా ఎదుర్కొందీ? అనేదే సినిమా కథ. ఇక అద్భుతమైన విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ ప్రధాన హైలైట్స్. అయితే.. గతంలో వచ్చిన మార్వెల్ సినిమాల్లో విలన్‌గా కనిపించిన పాత్రలు, ఈ సినిమాలో సూపర్ హీరోలుగా మారడం ఈ మూవీ ప్రత్యేకత.
ఇదిలాఉంటే.. ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ ఫ్లస్ (Apple TV), గూగుల్ ప్లే (Google Play) వంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రెంట్ (Rent/Buy) పద్దతిలో బయటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఈ రోజు (ఆగస్టు 27, 2025) నుంచి మన దేశంలో (India OTT Release) జియో హాట్ స్టార్ (JioHotstar) ఓటీటీ (OTT) లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మార్వెల్, హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారు, థియేటర్‌లో మిస్సయిన వారు తప్పక చూడాల్సిన మూవీ ఇది.