సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jarann OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన.. అదిరిపోయే సైకలాజికల్, హ‌ర్ర‌ర్ థ్రిల్లర్

ABN, Publish Date - Nov 10 , 2025 | 07:11 AM

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఉన్న‌ఫ‌లంగా ఓ మరాఠీ సైకలాజికల్, హ‌ర్ర‌ర్‌ థ్రిల్లర్ చిత్రం ‘జారణ్’ (Jarann) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Jarann

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఉన్న‌ఫ‌లంగా ఓ మరాఠీ సైకలాజికల్, హ‌ర్ర‌ర్‌ థ్రిల్లర్ చిత్రం ‘జారణ్’ (Jarann) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అమృతా సుభాష్, అనితా డేట్-కేల్కర్, కిషోర్ కదమ్, జ్యోతి మల్షే అవనీ జోషి నటించారు. హృషికేష్ గుప్తే (Hrishikesh Gupte) రచన దర్శకత్వం వహించగా అనీస్ బాజ్మీ ప్రొడక్షన్స్, A & N సినిమా, A3 ఈవెంట్స్ & మీడియా నిర్మించాయి.జూన్‌6న ముంబైలో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. ఇ్పుడు తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. మరాఠీ సంస్కృతీ సంప్రదాయాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ‘జారణ్’ అంటే మరాఠీలో చేతబడి, బాణామతి అనే అర్థం ఉంది. ఈ కథ రాధ (అమృతా సుభాష్) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. రాధ (అమృత సుభాష్) భర్త శేఖర్‌తో కలిసి నగరంలో పెద్ద ఇంట్లో ఉంటుంది. వారి కూతురు సైయీ. ఒకరోజు రాధ తల్లిదండ్రులు గ్రామంలోని పాత ఇల్లును అమ్మాలని నిర్ణయిస్తారు. అమ్మకానికి ముందుగా కుటుంబం మొత్తానికి “గెట్ టు గెదర్” ఏర్పాటు చేస్తారు. రాధ, సైయీతో కలిసి తన పుట్టింటికి వస్తుంది.

ఆ ఇంట్లో ఒక గది ఎప్పటి నుంచో మూసే ఉంటుంది. ఆ గదిలోని తాళం రంధ్రం (కీహోల్)లోంచి చూసిన రాధకి ఒక పాత బొమ్మ కనిపిస్తుంది. రాధ చిన్నప్పుడు ఆ గదిలో ‘గంగూతి’ (అనితా దాటే కేల్కర్) అనే మహిళ ఉండేది. ఆమె చేతబడి చేస్తుందని గ్రామస్తులు అనుకునేవారు. చివరికి ఆమెను గ్రామం నుంచి వెళ్లగొడతారు. వెళ్లే ముందు రాధ మీద తాను చేతబడి వేసిందని గంగూతి చెబుతుంది. ఆ తర్వాత రాధ ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

తల్లి ప్రయత్నంతో రాధ మామూలుగా మారుతుంది. కానీ ఇప్పుడు, మ‌ర‌లా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాధ ఆ గదిలోని పాత బొమ్మను బయటకు తీస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో విచిత్రమైన, భయానక సంఘటనలు మొదలవుతాయి. ఆ బొమ్మ వెనుకున్న రహస్యం ఏమిటి? రాధ కుటుంబానికి ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ.

ఇదిలాఉంటే.. ఈసినిమాను చూస్తే మ‌నం ఇప్ప‌టికే చాలాసార్లు చూసిన సినిమాల మాదిరిగానే ఉంటుంది. అక్క‌డ‌క్క‌డ థ్రిల్ ఇచ్చే పాయింట్లు ఒక‌టి రెండు మిన‌హా ఎక్కువ‌గా లేదు. పాత్రలను డిజైన్ చేసిన విధానం, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జ‌స్ట్ టైంఫాస్ కోసం చూడాల‌నుకుంటే ఒక మారు ఈ సినిమాను ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు. ఇప్పుడీ ‘జారణ్’ (Jarann) చిత్రం జీ5 (ZEE5) ఓటీటీ (OTT)లో మ‌రాఠీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యాక మ‌హారాష్ట్ర‌లో బాగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. చాలా మంది దీని గురించి మాట్లాడుకోవ‌డం విశేషం. దాంతో ఈ చిత్రానికి సంబంధించిన వార్త‌లు అక్క‌డ కొన్నాళ్లు బాగా వైర‌ల్ అయ్యాయి.

Updated Date - Nov 10 , 2025 | 07:30 AM