Thug life OTT: షాకింగ్.. సడన్‌గా ఓటీటీకి కమల్ థగ్‌లైఫ్! ఇక్కడైనా చూస్తారా
ABN, Publish Date - Jul 03 , 2025 | 09:17 AM
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ఘోర పరాజయం చవి చూసిన చిత్రం థగ్ లైఫ్ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులకు షాకిచ్చింది.
కమల్ హసన్ (Kamal haasan), మణిరత్నం (Mani ratnam) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొంది గత నెలలో థియేటర్లలోకి వచ్చి ఘోర పరాజయం చవి చూసిన చిత్రం థగ్ లైఫ్ (Thug life). త్రిష, శింబు, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులకు షాకిచ్చింది. మాములుగా అయితే జూలై 4 శుక్రవారం ఓటీటీకి రావాల్సి ఉన్న ఈ చిత్రం ఓ రోజు ముందుగానే బుధవారమే అందుబాటులోకి వచ్చింది. నాయకుడు వంటి కల్ట్ క్లాసికి తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేసిన చిత్రం కావడంతో రిలీజ్‌కు ముందు నుంచే వీపరీతమైన అంచనాలు పెరిగి విడుదల తర్వాత ఈ మేర చిత్రం లేకపోవడంతో మణిరత్నం, కమల్ లకేరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. చిన్నాయన అలియాస్ రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓల్డ్ ఢిల్లీలో పెద్ద డాన్. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ పేపర్ బాయ్ తండ్రి మరణిస్తాడు. దాంతో అతని కుమారుడు అమర్ (శింబు)ని చేరదీసి పెంచుతాడు. తప్పిపోయిన అమర్ నాలుగేళ్ల చెల్లెలిని సైతం వెతికే పనిలో ఉంటాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత శక్తిరాజుపై జరిగిన ఓ ఎటాక్ విషయంలో అమర్‌పై అనుమానాలు వస్తాయి. ఆపై ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చూరుతాయి. ఈ నేపథ్యంలో అమర్‌లో మార్పు ఎందుకు, ఎలా వచ్చింది, వృత్తిరీత్యా ఎదుగుదల కారణామా? ఇంద్రాణి (త్రిష) కారణమా? లేదా శక్తిరాజు తన తండ్రిని చంపాడనే కోపమా? నేపాల్ వెళ్లిన శక్తిరాజుకి ఏం జరిగింది అన్నది కథ.
గతంలో వచ్చిన నాయకుడు, నవాబ్ సినిమాల మాదిరి కథే కావడం, ముందు ఏం జరుగబోతుందనే ఊహించేలా ఉండడం అంతేగాక సెన్సిబిలిటీస్, ఎమోషన్స్ మిస్ అయ్యాయి.ఇక సినిమాలో అక్కడక్కడ అకట్టుకునే సంభాషణలు ఉండగా, యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్‌లో చిత్రీకరించారు. ఇప్ఉడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతవరకు థియేటర్‌లో చూడని వారు, కమల్, మణిరత్నం చిత్రాలు ఇష్ట పడే వారు ఒక్కసారి ఈ చిత్రాన్ని ప్రయత్నించవచ్చు. ఇదిలాఉంటే.. సినిమా రిలీజ్‌కు ముందు కమల్ వ్యాఖ్యలు, కన్నడ నాట సినిమా విడుదల కాకపోవడం ఆపై మూవీ డిజాస్టర్ అయి తీవ్రంగా నష్టపోయిన నిర్మాతలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు రావడం కూడా గొడ్డలిపోటులా తయారైంది. బాలీవుడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం 80 రోజుల తర్వాత రావాల్సి ఉండగా అన్ని భాషలతో కలిపి హిందీలోనూ ఈ థగ్ లైఫ్ (Thug life) సినిమాను ముందుగానే ఓటీటీకి తీసుకురావడంతో మేకర్స్ జరిమానా కింద రూ.25 లక్షలు చెల్లించాల్సి రావడం గమనార్హం.