సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Daksha OTT: నెల‌లోపే.. ఓటీటీకి వచ్చేసిన మంచు లక్ష్మి 'దక్ష'

ABN, Publish Date - Oct 17 , 2025 | 06:59 PM

చాలాకాలం విరామం తర్వాత మంచు లక్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ చిత్రం దక్ష.

Manchu laxmi

చాలాకాలం విరామం తర్వాత మంచు లక్ష్మి (Manchu Lakshmi) మళ్లీ తెరపైకి వచ్చింది. తనకంటూ ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ న‌టి తాజాగా “దక్ష – ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ (Daksha - The Deadly Conspiracy)” అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది.

త‌మ సొంత బ్యాన‌ర్‌ ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ (Sree Lakshmi Prasanna Pictures) బ్యాన‌ర్‌పై మోహ‌న్ బాబు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఈ చిత్రాన్ని నిర్మించ‌గా వంశీకృష్ణ మ‌ల్ల (Vamsee Krishna Malla) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani), విశ్వంత్ (Viswant Duddumpudi), మలయాళ నటుడు సిద్దిక్‌, చైత్ర శుక్ల ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టించ‌గా మోహ‌న్ బాబు (Manchu Mohan Babu) సైతం కీ రోల్ చేశారు.

కథ విష‌యానికి వ‌స్తే.. ప్రముఖ బిజినెస్‌మెన్ బలరాం వర్మ (సిద్దిక్) ఆధ్వర్యంలోని బయో ఫార్మ్ కంపెనీలో మనుషుల‌పై చేసే ప్రయోగాలు,హ‌త్య‌లు హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తాయి. పోలీసులకు అంతు ప‌ట్ట‌ని మిస్టరీగా మారతాయి. ఈ నేప‌థ్యంలోఈ కేసును చేధించేందుకు సీఐ దక్ష (మంచు లక్ష్మి) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభిస్తుంది.

దర్యాప్తులో ఆమెకు ఎదురయ్యే షాకింగ్ ట్విస్టులు, ఆయుర్వేద వైద్యురాలు మిథిల (చైత్ర శుక్ల) పాత్ర, అలాగే సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వామిత్ర (మోహన్ బాబు) పాత్రతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. చివరికి ఈ హత్యల వెనుక నిజమైన మాస్టర్ మైండ్ ఎవరు? అనే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో సినిమా సాగుతుంది.

మంచు లక్ష్మి తన కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించగా. మోహన్ బాబు ప్రెజెన్స్ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Oct 17 , 2025 | 06:59 PM