Until Dawn: సడన్‌గా ఓటీటీకి.. స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ హర్రర్‌థ్రిల్లర్! ఎందులో చూడాలంటే
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:10 PM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి భారీ విజయం సాధించిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంటిల్ డాన్ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి భారీ విజయం సాధించిన మరో హాలీవుడ్ బ్లాకబస్టర్ అంటిల్ డాన్ (Until Dawn) చిత్రం సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. 2015లో విడుదలై సంచలనం సృష్టించిన వీడియో గేమ్ ఆధారంగా సర్వైవల్ హర్రర్‌థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాకు గతంలో అన్నాబెల్, లైట్స్ అవుట్, షాజామ్ చిత్రాలను రూపొందించిన డేవిడ్ F. శాండ్‌బర్గ్ (David F. Sandberg) దర్శకత్వం వహించాడు. ఎల్లా రూబిన్ (Ella Rubin) , మైఖేల్ సిమినో (Michael Cimino), ఒడెస్సా అజియాన్జీ-యంగ్ యూ, బెల్మాంట్ కామెలీ, యా మిచెల్, పీటర్ స్టోర్‌మేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 15 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న థియేటర్లలోకి వచ్చి అన్ని చోట్లా మంచి టాక్తో విజయం సాధించింది. 52 మిలియన్ డాలర్లు సాధించి పెట్టింది.
ఇక కథ విషయానికి వస్తే.. మూవీ ప్రారంభంలోనే ఓ కిల్లర్ మెలనీ అనే యువతిని హత్య చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత మెలనీ చెల్లి క్లోవర్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మెలనీని వెతికేందుకు ఆ ప్రాంతానికి వెళుతుంది. అయితే అక్కడికి వెళ్లి చూడగా అంతా మిస్టీరియస్‌గా కనిపిస్తుంది. అదే సమయంలో అనుకోకుండా వారు టైమ్ లూప్‌లో చిక్కుకు పోతారు. ఆపై సైకో కిల్లర్ వచ్చి వాళ్లను చంపేయడం ఆ వెంటనే వాళ్లు తిరిగి బతికి రావడం పదే పదే జరుగుతుంది. ఈనేపథ్యంలో వారు ఆ టైమ్ లూప్‌లో నుంచి బయటకు రావడానికి ఎలాంటి పనులు చేయాల్సి వచ్చింది. సురక్షితంగా బయటకు రాగలిగారా లేదా అనే స్పైన్ చిల్లింగ్ కథ కథనాలతో సాగుతూ మూవీ చూసే ప్రేక్షకులకు సూపర్ థ్రిల్‌ను ఇస్తుంది.
టైమ్ లూప్‌లో చిక్కుకున్న ఆ ఐదుగురు మిత్రులు అందులో నుంచి బయట పడడానికి ఒక రాత్రి చావకుండా బతికి ఉండాలి. ఈ క్రమంలో వాళ్లు బతికుండడానికి అనేక ప్రయత్నాలు చేయడం.. అదే సమయంలో కిల్లర్ వారిని రకరకాలుగా క్రూరంగా చంపడం జరుగుతూ నెక్ట్స్ ఏంటి అనే ఫీల్ ఇస్తుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video IN) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది కానీ రెంటల్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో లేదు, ఇంగ్లీష్, హిందీ భాష్లలో స్ట్రీమింగ్ అవుతుంది.
మంచి హర్రర్ టైపు, స్లాసర్ సినిమాలు ఇష్ట పడే వారికి ఈ చిత్రం ఫుల్ మీల్స్ భోజనం పెడుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అంటిల్ డాన్ (Until Dawn) సినిమాను ఎట్టి పరిస్తితుల్లో మిస్ అవ్వొద్దు. అయితే ఐదేండ్ల క్రితం తమిళంలో సత్యరాజ్ ఆయన కుమరుడు సిబిరాజ్ కాంబోలో వచ్చిన దొర అనే సినిమా కూడా ఈ హర్రర్ జానర్ కాన్సెప్ట్‌తోనే రావడం గమనార్హం. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులోనూ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.