Kanya Kumari OTT: సడన్‌గా.. ఓటీటీకి లేటెస్ట్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ! మీరూ లవ్‌లో పడిపోతారు
ABN, Publish Date - Sep 16 , 2025 | 08:01 PM
గత నెల ఆగస్టు 27న థియేటర్లకు వచ్చిపాజిటివ్ టాక్ తెచ్చున్న ప్రేమకథా చిత్రం కన్యాకుమారి.
గత నెల ఆగస్టు 27న థియేటర్లకు వచ్చిపాజిటివ్ టాక్ తెచ్చున్న ప్రేమకథా చిత్రం కన్యాకుమారి (Kanya Kumari). గీత్ సైని (Geetha Saini), శ్రీచరణ్ రాచకొండ (Sricharan Rachakonda) హీరో హీరోయిన్లుగా నటించగా సీనియర్ నటి మధుశాలిని (Madhu Salini) సమర్పణలో దర్శకుడు సృజన్ (Srujan Attada) తన రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ బ్యూటీఫుల్ ఫన్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
గతంలో.. ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సృజన్ మలి ప్రయత్నంగా పూర్తి శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కన్యాకుమారి మూవీని రూపొందించడం విశేషం. ముఖ్యంగా శ్రీకాకుళం అమ్మాయిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. శ్రీకాకుళంలోని మారుమూల పల్లెలో ఉండే తిరుపతి చదువు ఎక్కగా రైతుగా మారి వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఆ పక్క గ్రామంలో ఉండే కన్యాకుమారి డిగ్రీ పూర్తి చేసి బాగా చదువుకున్న వాడిని పెళ్ళి చేసుకుని, సిటీకి వెళ్ళిపోయి, అక్కడ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని కలలు కంటూ ఉంటుంది.
ఈక్రమంలో కన్యాకుమారిని ఎలాగైనా ఒప్పించి, ప్రేమతో పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు తిరుపతి. ఈ నేపథ్యంలో కథ ఎన్ని మలుపులు తిరిగిందనే కథకథనాలతో సినిమా మంచి కామెడీ పంచులతో సాగుతూ, డైలాగులతోనూ మెప్పిస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంచక్కా మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడీ కన్యాకుమారి (Kanya Kumari) సినిమా సెప్టెంబర్ 17 బుధవారం నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha) ఓటీటీ (OTT)లలో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మిస్సయిన వారు, మంచి ఫ్యామిలీ చూడాలనుకునే వారు ఎంచక్కా చూసేయవచ్చు.