సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sarangapani Jathakam Ott: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన‌ లేటెస్ట్ ఫ్యామిలీ, కామెడీ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - May 23 , 2025 | 08:04 AM

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్న వినోదాత్మ‌క చిత్రం సారంగపాణి జాతకం స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.

sarangaphani

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్న వినోదాత్మ‌క చిత్రం సారంగపాణి జాతకం (Sarangapani Jathakam). ప్రియదర్శి (Priyadarshi), రూపా కొడవాయూర్ (Roopa Koduvayur) జంటగా నటించిన ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. డైరెక్ట‌ర్ ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohanakrishna Indraganti), శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) కాంబినేష‌న్‌లో 'జెంటిల్ మన్, సమ్మోహనం' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రంగా ఈ మూవీ వ‌చ్చింది. శ్రీనివాస్ అవ‌స‌రాల (Srinivas Avasarala), సీనియ‌ర్ న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, హ‌ర్ష చెముడు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. చిన్నప్పటి నుంచి అతనికి జాతకాలంటే పిచ్చి ఉన్న సారంగపాణి (ప్రియదర్శి) తను సెల్స్ మెన్‌గా ప‌నిచేసే కార్ షోరూమ్ మేనేజర్ మైథిలి (రూపా కొడవాయూర్) తో ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి, ఇద్దరూ పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో సారంగ చేయి చూసిన జిగేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) అతని జాతకంలో ఓ చిక్కుముడి ఉందని చెబుతాడు. దాంతో షాక్ కు గురైన సారంగ.. ఈ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకునే వర‌కు మైథిలీతో తన పెళ్ళిని వాయిదా వేస్తాడు. జిగేశ్వర్ చెప్పిన చిక్కుముడి ఏమిటీ? దాన్ని విప్పడానికి సారంగ ఏం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో సారంగను ఎవరెవరు ఎలా అపార్థం చేసుకున్నారు? తిరిగి సారంగ, మైథిలి ఎలా ఒక్కటి అయ్యారు? అనేది మిగతా కథ.

ముక్కూ ముఖం తెలియని వ్యక్తి చెయ్యి చూసి చెప్పిన జాతకాన్ని నమ్మి.. సారంగపాణి ఎలా కష్టాలను కొన్ని తెచ్చుకున్నాడు? అనే క‌థాంశంతో ప్రారంభం నుంచి ముగింపు వరకూ నాన్ స్టాప్ వినోదంతో సాగుతుంది. దాదాపు అంతా అచ్చ తెలుగు న‌టీన‌టుల‌తోనే తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో సినిమా మిస్స‌యిన వారు, కాల‌క్షేపం కోసం ఈ సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) సినిమాను ఓ సారి చూసేయ‌వ‌చ్చు. ఎలాంటి అశ్లీల, అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు లేవు కుటుంబంతోనూ క‌లిసి వీక్షించ‌వ‌చ్చు.

Updated Date - May 23 , 2025 | 01:32 PM