Kushita Kallapu: నిర్మాతకు  కుషిత కల్లపు కృతజ్ఞతలు 

ABN, Publish Date - May 01 , 2025 | 06:43 PM

ఆహా ఓటీటీ (Aha Ott) సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2 త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది తెలుగు అమ్మాయి కుషిత కల్లపు

ఆహా ఓటీటీ (Aha Ott) సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2 త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది తెలుగు అమ్మాయి కుషిత కల్లపు (kushitha kallapu). తాజాగా రిలీజ్ చేసిన ఆమె క్యారెక్టర్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో తనకు "త్రీ రోజెస్" ద్వారా నిర్మాత ఎస్ కేఎన్ పెద్ద అవకాశం ఇచ్చారని థ్యాంక్స్ చెప్పింది యువ నటి కుషిత కల్లపు. ఈ సిరీస్ ఘన విజయాన్ని సాధించి తనకు కావాల్సినంత గుర్తింపు తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మంచి టీమ్ తో పనిచేసే అవకాశం ఈ సిరీస్ తో తనకు దొరికిందని కుషిత అన్నారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కేఎన్ తో తాను తీసుకున్న ఫొటోను ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది కుషిత. తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గానే కాదు 24 క్రాఫ్టులలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెప్పిన నిర్మాత ఎస్ కేఎన్ తన మాట నిలబెట్టుకుంటున్నారు

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్" సీజన్ 2ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

Updated Date - May 01 , 2025 | 06:43 PM