K Ramp OTT: ముద్దుల దండయాత్ర.. 'కె - ర్యాంప్' ఓటీటీకి వచ్చేసింది
ABN, Publish Date - Nov 15 , 2025 | 07:41 AM
దీపావళికి నాలుగు చిత్రాల నడుమ థియేటర్లకు వచ్చి సైలైంట్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం కె - ర్యాంప్ ఓటీటీకి వచ్చేసింది.
దీపావళికి నాలుగు చిత్రాల నడుమ థియేటర్లకు వచ్చి సైలైంట్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం కె - ర్యాంప్ (K - Ramp). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా యుక్తి తరేజా (Yukti Tareja) కథానాయికగా నటించగా జైన్స్ నాని (Jains Nani) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సాయి కుమార్, సీనియర్ నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. విడుదలకు ముందు నుంచే వార్తల్లో నిలిచిన ఈ సినిమా విడుదల అనంతరం మంచి పాజిటివ్ టాక్‌తో దీపావళి విన్నర్‌గా నిలిచింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. పెద్ద వ్యాపారవేత్త అయిన కృష్ణ (సాయికుమార్) గారాల కుమారుడు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం). చదువుపై శ్రద్ద సరిగ్గా పెట్టడం లేదని కేరళలోని కాలేజీకి పంపిస్తాడు. అక్కడ ఫప్ట్ సైట్‌లోనే మెర్సీ జాన్ (యుక్తి తరేజా)ను ప్రేమించి ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుని జీవితాంతం వెన్నంటే ఉంటానని మాటిస్తాడు. ఇంతకు అసలు మెర్సీ ఎవరు? అమెకు ఉన్న సమస్య ఏంటి, దానితో కుమార్ ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, చివరకు వాల్లిద్దరు కలిశారా లేదా, తన తండ్రి విలువ తెలిసి వచ్చిందా లేదా అనేదే కథ.
ఇలాంటి స్టోరీలు మనం గతంలోనే అనేకం చూసినా ఈ మూవీ నడిచిన విధానం వాటన్నింటికి భిన్నంగా కొత్త పంథాలో సాగుతూ చివరి వరకు సీటులో కూర్చోబెడుతుంది. ప్రధానంగా హీరోయిన్‌కు ఉన్న మెంటల్ డిజార్డర్ సమస్య దాని వళ్ల వచ్చే సమస్యలు హీరోకు ఎదురయ్యే వింత పరిస్థితులు ఆ సందర్భంగా పుట్టే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అలాగే డైలాగులు సైతం ఆకట్టుకుంటాయి. ఫస్టాప్ అంతా కాలేజీ, ప్రేమాయణం సాగి ఇంటర్వెల్ అతర్వాత కథ స్పీడ్ అందుకుని ఎమోషనల్‌గా నడిచి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడీ చిత్రం ఆహా (Aha) ఓటీటీ (OTT)లో ప్రసారంఅవుతుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, మంచి రొమాంటిక్ కామెడీ చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఫర్పెక్ట్ ఛాయిస్. అయితే.. సినిమాలో ముద్దుల దండయాత్ర ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు డజన్ వరకు ఉంటాయి. సో.. పిల్లలను ఈ మూవీకి దూరంగా ఉంచడం మంచిది.