సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Last Samurai Standing OTT: 300 మంది.. స‌మురాయ్‌లు త‌ల‌బ‌డితే! ఓటీటీకి.. క‌ళ్లు చెదిరే వెబ్ సిరీస్

ABN, Publish Date - Oct 27 , 2025 | 11:43 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు చాలా కాలం త‌ర్వాత స‌మురాయ్ నేప‌థ్యంలో యాక్ష‌న్ హిస్టారిక‌ల్ డ్రామా లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ వ‌స్తోంది.

Last Samurai Standing

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు చాలా కాలం త‌ర్వాత స‌మురాయ్ నేప‌థ్యంలో యాక్ష‌న్ హిస్టారిక‌ల్ డ్రామా లాస్ట్ సమురాయ్ స్టాండింగ్’ (Last Samurai Standing) వ‌స్తోంది. అయితే సినిమాగా కాకుండా సిరీస్‌గా వ‌స్తుండ‌డం విశేషం. జ‌పాన్ నుంచి వ‌స్తోన్న ఈ సిరీస్‌కు మిచిహిటో ఫుజి (Michihito Fujii), కెంటో యమగుచి (Kento Yamaguchi), టోరు యమమోటో (Toru Yamamoto) ముగ్గురు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డం విశేషం. జునిచి ఒకాడ (Junichi Okada), యుమియా ఫుజిసాకి (Yumia Fujisaki), కాయ కియోహర (Kaya Kiyohara), హిరోషి తమకి (Hiroshi Tamaki), హిడెకి ఇటో (Hideaki Itō), గాకు హమదా (Gaku Hamada), హిరోషి అబే (Hiroshi Abe) వంటి తార‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 19వ శ‌తాబ్ధం చివ‌ర‌లో జ‌పాన్‌లో నాటి పాల‌కులు క్యోటోలోని టెన్ర్యు-జీ ఆలయం నుంచి టోక్యో వ‌ర‌కు వెళ్లి తిరిగి వ‌చ్చిన ఒక‌రికి బిలియ‌న్ య‌న్ న‌గ‌దు ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు. దీంతో దేశం న‌లుమూల‌ల నుంచి ఉద్దండులైన 292 మంది స‌మురాయ్‌ యోధులు పోటీలో పాల్గొనేందుకు వ‌స్తారు. వీరిలో షుజిరో సాగా అనారోగ్యంతో ఉన్న త‌న భార్యా పిల్ల‌ల‌ను ర‌క్షించుకునేందుకు పోటీలో దిగుతాడు.ఈ నేప‌థ్యంలో అంత‌మంది యోధుల‌తో హీరో ఎలా పొరాటం చేశాడు, మ‌ద్య‌లో జ‌రిగిన వ్య‌వ‌హారాలేంటి, హీరో గెలిచాడా, మ‌ర‌ణించాడా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం, యాక్ష‌న్ సీన్ల‌తో సినిమా సాగుతుంది.

మ‌నం ఇప్ప‌టింర‌కు చూసిన‌, విన్న క‌థ‌లే అయినా స‌మురాయ్ నేప‌థ్యంలో కావ‌డంతో ఈ సిరీస్ కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. బాంబులు, తుఫాకులు వంటి అయుధాలు కాకుండా సిరీస్ అసాంతం థ్రిల్‌కు గురి చేసే క‌త్తి ఫైట్లతో నిందడి పోయింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ చూస్తే అది అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడీ సిరీస్‌ ‘లాస్ట్ సమురాయ్ స్టాండింగ్’ (Last Samurai Standing) న‌వంబ‌ర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఇంగ్లీష్‌, జ‌ప‌నీస్ భాష‌ల్లో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Oct 27 , 2025 | 02:52 PM