సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: అదిరిపోయే హ‌ర్ర‌ర్ థ్రిల్లర్‌.. ఓటీటీకి వ‌చ్చేసింది

ABN, Publish Date - Oct 17 , 2025 | 07:41 PM

గత నెలలో మిరాయ్ సినిమాకు పోటీగా థియేటర్లలో విడుద‌లై మంచి విజయం సాధించిన తెలుగు హారర్ థ్రిల్ల‌ర్ చిత్రం కిష్కిందపురి.

Kishkindhapuri

గత నెలలో మిరాయ్ సినిమాకు పోటీగా థియేటర్లలో విడుద‌లై మంచి విజయం సాధించిన తెలుగు హారర్ థ్రిల్ల‌ర్ చిత్రం కిష్కిందపురి (Kishkindhapuri). బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) మ‌ల‌యాళ న‌టుటు సాండీ మాస్ట‌ర్‌, సీనియ‌ర్ న‌టి ప్రేమ కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆద‌ర‌ణే ద‌క్కింది. థ్రిల్లింగ్ స్టోరీ, విజువల్స్, మ్యూజిక్ విభాగాల్లో ప్ర‌త్యేక పేరు సంపాదించికుంది. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌), మైథిలి (అనుపమ పరమేశ్వరన్‌), సుదర్శన్‌ ముగ్గురు కలిసి “ఘోస్ట్ రైడ్ టూర్స్‌” అనే సంస్థలో పని చేస్తుంటారు. భయంకరమైన ప్రదేశాలను సందర్శించే ఈ టీమ్‌ మూడో ట్రిప్ కోసం కిష్కిందపురిలోని పాడైపోయిన సువర్ణమాయ రేడియో స్టేషన్‌ కి వెళ్తారు. అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. ఓ పాత రేడియో ఒక్కసారిగా ఆన్‌ అవుతుంది. ఇక్కడ అడుగు పెట్టిన వారు చావడం ఖాయం అని చెబుతుంది.

ఆపై రేడియోలో చెప్పిన‌ట్టుగానే అక్క‌డ‌కు వ‌చ్చిన వారిలో ఒక్కొక్కరు చనిపోతుండటంతో రాఘవ, మైథిలి ఈ రహస్యాన్ని చేధించే ప్రయత్నం చేస్తారు. చివరికి ఆ రేడియో స్టేషన్‌లో జరిగిన నిజాలు ఏంటి? ఆ మృతుల వెనుక ఉన్న కారణం ఏమిటి? అనే విషయాలు సినిమా చివరి వరకు సస్పెన్స్‌గా కొనసాగుతాయి.

ఇప్పుడీ చిత్రం ఈ రోజు శుక్ర‌వారం (అక్టోబర్ 17) సాయంత్రం 6 గంటల నుంచి ZEE5 (జీ5) లో తెలుగుతో పాటు ఇతర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండ‌గా.. వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఆక్టోబ‌ర్ 19న‌ సాయంత్రం 6 గంట‌ల జీ తెలుగు (Zee Telugu) శాటిలైట్ టీవీ ఛాన‌ల్‌లో ప్ర‌సారం కానుంది. మ‌ద‌ర్ సెంటిమెంట్ ఈ కిష్కింద‌పురి (Kishkindhapuri) సినిమాకు హైలెట్ పార్ట్‌ల‌లో ఒక‌టి. థియేట‌ర్‌ల‌లో ఈ సినిమాను మిస్స‌యిన వారు, హ‌ర్ర‌ర్ సినిమాలు ఇష్ట ప‌డే వారు మ‌స్ట్ గా చూడాల్సిన సినిమా ఇది.

Updated Date - Oct 17 , 2025 | 10:42 PM