Kalivi Vanam OTT: నాగదుర్గ ఫస్ట్ సినిమా.. ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:03 AM
గత నెలాఖరున నవంబర్21న థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్న చిత్రం కలివి వనం.
గత నెలాఖరున నవంబర్21న థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్న చిత్రం కలివి వనం (Kalivi Vanam ). ఈ చిత్రంతో ప్రముఖ జానపద స్టార్ నటి నాగ దుర్గ (Naga Durga) కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. రఘుబాబు (Raghu Babu), సమ్మెట గాంధీ (Sammeta Gandhi), బిత్తిరి సత్తి (Bithiri Sathi) వంటి పేరున్న నటులు ప్రధాన పాత్రల్లో నటించగా ఏ. ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించాడు. అయితే సరైన ప్రచారం లేక జనాలకు చేరువ కాలేకపోయింది. ఇప్పుడీ సినిమా సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
తెలుగు రాష్ట్రాలలో ప్రాచుర్యం పొందిన పద్మశ్రీ వన జీవి రామయ్య, అలాగే తనకున్న భూమిని మొత్తాన్ని అడవిగా మార్చిన దుశ్చర్ల సత్యనారాయణ వంటి ప్రముఖుల స్ఫూర్తితో చెట్లను పెంచాలి, అడవులను కాపాడుకోవాలనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫ్యాక్టరీ నిర్మించడానికి ఊర్లో ని చెట్లు కొట్టేయాలని చూస్తున్న సమయంలో ఓ టీచర్, అక్కడి గ్రామస్థుల సాయంతో ఎలా పోరాటం చేసిందనేదే కథ.
అయితే.. ఇప్పటి వరకు మనం చూసిన అనేక సినిమాల మాదిరి కథే అయినా అడవులు, చెట్లు ప్రాముఖ్యతను అధికంగా చర్చించారు. కానీ జరగబోయేది ముందే తెలుస్తుండడం, ఎంటర్‌టైన్మెంట్ లోపించడం వలల్ల అందరికీ సినిమా కనెక్ట్ కావడం కష్టం. ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూడాలనుకునే వారు, నాగ దుర్గ ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడా, ఎలాంటి వల్గారిటీ, అశ్లీలత లేకుండా రూపొందిన ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూసేయవచ్చు. ఈ సినిమా ఇప్పుడు ఈ టీవీ విన్ ( Etv Win) ఓటీటీలో అందుబాటులో ఉంది.