4.5 Gang OTT: ఓటీటీకి తెలుగులో.. మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ సిరీస్
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:40 AM
చాలా రోజుల తర్వాత మలయాళం నుంచి ఓ డార్క్ క్రైమ్, కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
చాలా రోజుల తర్వాత మలయాళం నుంచి ఓ డార్క్ క్రైమ్, కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ (4.5 Gang) సీజన్1 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. జగదీష్ (Jagadish), నిరంజ్ మణియన్‌పిల్ల (Niranj Maniyanpilla), శ్రీనాథ్ బాబు (Sreenath Babu), దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), సంతి బాలచంద్రన్ (Santhy Balachandran), క్రిశాంద్ (Krishand) కీలక పాత్రల్లో నటించగా క్రిశాంద్ (Krishand) దర్వకత్వం వహించాడు. కొత్తగా గ్యాంగ్‌గా ఏర్పడి నలుగురు పెద్ద కుర్రాళ్లు ఓ మరుగుజ్జు నేపథ్యంలో తెరకెక్కిన స్టోరి ఇది.
మొత్తం ఆరు ఏపిసోడ్స్ ఒక్కోకటి 50 నిమిషాలకు పైగా నిడివితో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 4.5 గ్యాంగుగా పిలవబడే 5గురు మిత్రలు తమ స్కూల్ లైఫ్ నుంచి వృద్ధాప్యం వరకు కలిసి మెలిసి చేసిన వ్యవహారాలు, ఎదుర్కొన్న సమస్యలు, గ్యాంగ్‌గా ఎలా మారారు అనే కథనంతోనే ఆరు ఎపిసోడ్లు రన్ అవుతాయి. ఈ నేపథ్యంలోనే నేటి సమాజ పోకడలపై సెటైర్లు వేస్తూనే చాలా సన్నివేశాలలో డార్క్ కామెడీతో రఫ్ఫాడిస్తారు. అంతేగాక రియాలిటీకి దగ్గరగా స్మగ్లింగ్, పొలిటికల్, యాక్షన్ ఇలా అన్ని రంగాలను టచ్ చేస్తూ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సిరీస్ ఆకట్టుకుంటుంది.
అయితే.. మనం రెగ్యులర్‌గా చూసే కథ కావడం, కొన్ని సందర్భాల్లో డ్రామటిక్, లాగింగ్ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఫస్ట్ ఎపిసోడ్ను కాస్త ఓపికతో చూస్తే రెండో ఎపిసోడ్ నుంచి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్ఉవగా ఉంటుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటూ చూసే వారికి మంచి ఫీల్ ఇస్తాయి. ప్రస్తుతం ఈ సిరీస్ సోని లీవ్ (SONY LIV) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో భూతులు, రెండు మూడు అసభ్య సన్నివేశాలు ఉన్నందు వళ్ల పిల్లలను ఈ 4.5 గ్యాంగ్ (4.5 Gang) సిరీస్‌కు దూరంగా ఉంచడం ఉత్తమం. ఓన్లీ పెద్దలు మాత్రమే చూడదగిన సబ్జెక్ట్.