సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kishkindhapuri OTT: ఓటీటీకి.. లేటెస్ట్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ కిష్కింద‌పురి!. కానీ ఫ‌స్ట్ అక్క‌డే

ABN, Publish Date - Oct 10 , 2025 | 01:22 PM

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన తెలుగు స్ట్రెయిట్ హ‌ర్ర‌ర్ చిత్రం కిష్కింద‌పురి.

Kishkindhapuri OTT

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన తెలుగు స్ట్రెయిట్ హ‌ర్ర‌ర్ చిత్రం కిష్కింద‌పురి (Kishkindhapuri). బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) మ‌ల‌యాళ న‌టుటు సాండీ మాస్ట‌ర్‌, సీనియ‌ర్ న‌టి ప్రేమ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సెప్టెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం అన్ని ప్రాంతాలు, వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. మిరాయ్ వంటి భారీ చిత్రంతో పోటీ ప‌డి ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త థ్రిల్‌ను అందించింది. ఇప్పుడీ సినిమా డిజిట్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిఉంది. అంతేకాదు అందుకుముందు వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌రర్‌గా టీవీల‌లో రానుండ‌డం విశేషం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌), మైథిలి(అనుపమా పరమేశ్వరన్‌), సుదర్శన్‌ ముగ్గురూ క‌లిసి ఔట్సాహికులైన వారికి ఘోస్ట్‌ రైడ్‌ టూర్స్‌ నిర్వహిస్తుంటారు. రెండు ట్రిప్పులు విజ‌య‌వంతంగా ముగించుకున్న ఆ 11 మంది స‌భ్యుల టీమ్ ముచ్చ‌ట‌గా మూడో ట్రిప్పు కోసం కిష్కింధపురిలోని సువర్ణమాయ అనే పాడుపడిన రేడియో స్టేషన్‌కి త‌లుపులు ప‌గుల గొట్టి మ‌రి వెళ్తారు. తీరా లోప‌లికి వెళ్లాక వారికి వింత ఘ‌ట‌ల‌ను ఎదురైతాయి, అంతేగాక ఓ రేడియో దానిక‌ల్లా అదే స్టార్ట్ అయి ఇక్క‌డ అడుగు పెట్టిన వారు చావ‌డం ఖాయం అంటూ చెబుతుంది. ఈక్ర‌మంలో రెడియో చెప్పిన‌ట్టుగానే ఈ స్టేష‌న్‌లోకి మోద‌ట అడుగు పెట్టిన ఇద్ద‌రు చ‌నిపోతారు. మూడో మ‌ర‌ణం కూడా జ‌రుగుతున్న స‌మ‌యంలో రాఘవ వ‌చ్చి కాప‌డ‌గ‌లుగుతాడు.

ఇంత‌కు అలా మ‌ర‌ణాలు జ‌ర‌గడానికి కార‌ణ‌మేంటి అని రాఘ‌వ మైథిలితో క‌లిసి మూలాల కోసం వెతికే క్ర‌మంలో అనేక విష‌యాలు బ‌య‌ట ప‌డుతాయి. అయితే వాళ్ల‌కు ఓ విష‌యం తెలిసిన కాసేప‌టికే దాని వెన‌కాల మ‌రోటి బ‌య‌ట ప‌డుతూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆ రెడియో స్టేష‌న్‌లో గ‌తంలో ఏం జ‌రిగింది, అక్క‌డ జ‌రిగిన మ‌ర‌ణాల వెన‌క సీక్రెట్ ఏంటి, వైకల్యంతో అంద వికారంగా పుట్టిన విసృత పుత్ర, అతని తల్లి (ప్రేమ) కథేంటి? ఆ రేడియో స్టేషన్‌కు   వారికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.

మ‌నం అప్ప‌టి వ‌ర‌కు చూసిన కథ వెంట‌నే మ‌రొ ర‌కంగా మారుతూ సినిమా చూసే వారిక అదిరిపోయే థ్రిల్ ఇస్తుంది. అయితే సినిమా అసాంతం ద‌య్యాలు, భ‌య పెట్ట‌డం క‌న్నా ఇన్వెస్టిగేష‌న్ మోడ్‌లోనే ఎక్కువ సాగిన‌ట్లు అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, సెకండాఫ్‌లో అనుప‌మ ద‌య్యంగా మారే సినిమాలు గూస్‌బంప్స్, తెప్పించ‌డ‌మే ఖాయం. మ‌ద‌ర్ సెంటిమెంట్ ఈ కిష్కింద‌పురి (Kishkindhapuri) సినిమాకు మైలెట్ పార్ట్‌ల‌లో ఒక‌టి. థియేట‌ర్‌ల‌లో ఈ సినిమాను మిస్స‌యిన వారు, హ‌ర్ర‌ర్ సినిమాలు ఇష్ట ప‌డే వారు మ‌స్ట్ గా చూడిల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌ఘా ఆక్టోబ‌ర్ 17న‌ జీ తెలుగు (Zee Telugu) శాటిలైట్ టీవీ ఛాన‌ల్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు. రెండు రోజుల త‌ర్వాత ఆక్టోబ‌ర్ 19న సాయంత్రం 6 గంట‌ల నుంచి జీ5 (Z5) ఓటీటీలో తెలుగులో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నారు.

Updated Date - Oct 10 , 2025 | 01:22 PM