Metro In Dino OTT: ఓటీటీలో.. అనురాగ్ బ‌సు లేటెస్ట్ ఫీల్‌గుడ్ రొమాంటిక్ డ్రామా!

ABN , Publish Date - Aug 29 , 2025 | 08:13 AM

గ‌త నెల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన మ్యూజిక‌ల్, రొమాంటిక్ డ్రామా బాలీవుడ్‌ చిత్రం మెట్రో ఇన్ దినో.

Metro In Dino

గ‌త నెల జూలై4 న‌థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన మ్యూజిక‌ల్, రొమాంటిక్ డ్రామా బాలీవుడ్‌ చిత్రం మెట్రో ఇన్ దినో(Metro In Dino). అంటే మెట్రో న‌గ‌రాల్లో ఈ రోజుల్లో అని అర్థం. 2007లో వ‌చ్చిన లైఫ్ ఇన్ ఏ మెట్రో ( Life in a... Metro) చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కించాడు హిందీ అగ్ర ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సు (Anurag Basu). అనుప‌మ్ ఖేర్ (Anupam Kher), నీనా గుప్తా (Neena Gupta), కొంక‌నా సేన్ శ‌ర్మ (Konkona Sen Sharma), పంక‌జ్ త్రిపాఠి (Pankaj Tripathi), ఆదిత్య‌ రాయ్ క‌పూర్ (Aditya Roy Kapur), అలీ ఫ‌జ‌ల్ (Ali Fazal), సారా అలీఖాన్ (Sara Ali Khan), ఫ‌తిమా స‌నా షేక్ (Fatima Sana Shaikh) వంటి తార‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. మ‌న దేశంలో మెట్రో న‌గ‌రాలైన ముంబ‌య్‌, డిల్లీ, బెంగ‌ళూరు, కోల‌క‌క‌తా వంటి న‌ట‌రాల్లో నేటి యువ‌త‌, భార్యా భ‌ర్త‌లకు ప్రేమ అంటే ఏమిటి, వివాహా బంధం అవ‌స్య‌క‌త‌, ఏది ప్రేమ అనేది తెలియ‌క తిక‌మ‌క ప‌డుతూ జీవితాలు సాగించే నాలుగైదు జంట‌ల రెగ్యుల‌ర్ జంట‌ల జీవితాన్ని చూపిస్తూ ఈ సినిమా సాగుతుంది. పెళ్లైన వారు చేసే ప‌నులు, ల‌వ‌ర్స్ పెళ్లి కోసం చేసే ఎత్తుగ‌డ‌లు, అవ‌త‌లి వారిని లైన్‌లో పెట్ట‌డానికి నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు ఇలా మ‌న దైనందిన జీవితంలో భార‌తీయ ప్ర‌జ‌ల నిత్య జీవ‌న స్థితిగ‌త‌లును అద్దం ప‌ట్టే పాయింట్ల‌ను క‌థా వ‌స్తువుగా మ‌లిచి సంగీత రూప‌కంగా సినిమాను తెర‌కెక్కించారు. ఒక్కొక్క‌రి జీవితం ఒక్కో తీరుగా ఉంటూ వారి జీవితాలెలా గాడిన ప‌డ్డాయ‌నే లైన్‌తో స్టోరిని ముగించారు.

Metro In Dino

సినిమా ఆరంభం నుంచి ల‌వ్, ఓమోష‌న్స్, పాట‌ల చుట్టూనే సినిమా న‌డుస్తూ ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా అక్క‌డ‌క్క‌డ ఒక్క‌టి రెండు ఇంటిమేట్ త‌ర‌హా స‌న్నివేశాలు మిన‌హా సినిమా అంతా ఫీల్ గుడ్‌ రొమాంటిక్‌గా సాగుతుంది. అయితే క‌ట్టుబాట్లు, స‌నాత‌నం అంటూ మాట్లాడేవారికి ఇది ఓ వేలం వెర్రి సినిమా అనిపించ‌క మాన‌దు. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix India) ఓటీటీలో కేవ‌లం హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రం చూడాల‌నుకే వారికి ఈ మెట్రో ఇన్ దినో(Metro In Dino) మూవీ బెస్ట్ అఫ్స‌న్‌. మీకూ బాగా న‌చ్చే అవ‌కాశాలు అధికంగానే ఉంటాయి.

Updated Date - Aug 29 , 2025 | 09:32 AM