Beauty OTT: ఎట్టకేలకు.. ఓటీటీకి 'బ్యూటీ'! కూతురిపై.. అతి ప్రేమ ఏం చేసింది
ABN, Publish Date - Dec 31 , 2025 | 11:23 AM
మూడు నెలల క్రితం థియేటర్లకు వచ్చి మంచి పాజిటివ్ దక్కించుకున్న లవ్, ఫ్యామిలీ డ్రామా చిత్రం బ్యూటీ ఎట్టకేలకే ఓటీటీకి వచ్చేస్తోంది.
మూడు నెలల క్రితం థియేటర్లకు వచ్చి మంచి పాజిటివ్ దక్కించుకుని ఓ మోస్తరు విజయం సాధించిన క్యూట్ ఎమోషనల్ లవ్, ఫ్యామిలీ డ్రామా చిత్రం బ్యూటీ (Beauty). మారుతీ నగర్ సుబ్రమణ్యం, ఆయ్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత అంకిత్ కొయ్య (Ankith Koyya) ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో నటించగా నిలఖి పాత్రా (Nilakhi Patra) హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నరేశ్, వాసుకీ ఆనంద్, నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహారా కీలక పాత్రలు చేశారు. జే వర్థన్ దర్శకత్వం వహించగా విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) సంగీతం అందించాడు. ఇప్పుడీ సినిమా 100 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
కథ విషయానికి వస్తే.. క్యాబ్ డ్రైవర్ నారాయణకు తన కూతురు అలేఖ్య అంటే పంచప్రాణాలు. ప్రతి నిమిషం కంటికి రెప్పలా, మాటల్లో చెప్పలేని ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే కాలేజీకి వెళ్లి చదువుకునే అలేఖ్య తన పుట్టిన రోజున టూవీలర్ గిఫ్ట్‌గా ఇస్తానని ప్రామిస్ చేసిన తండ్రి బండి కోనివ్వలేదని అలిగి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అయితే.. అలేఖ్య ప్రేమిస్తున్న అర్జున్ నేను బండి కోనిస్తానని ప్రామీస్ చేస్తాడు. కానీ ఆమె తీసుకున్న నిర్ణయంతో అర్జున్, నారాయణ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. కోపంతో తీసుకున్న డిసీసన్ అలేఖ్యను ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది..నారాయణ తన కూతురిని కాపాడుకోవటానికి ఏం చేస్తాడు? చివరకు ఆమె ఎలా బయటపడిందనేదే సినిమా కథాంశం.
క్యూట్ లవ్‌స్టోరీ, చివరలో వచ్చే ట్విస్టు ఓ వైపు.. కూతురిపై అపరిమితమైన ప్రేమను చూపించే తండ్రి పడే వేదన మరో వైపు నడిచే కథతో సినిమా సాగుతుంది. అయితే అల్రేడీ ఇప్పటివరకు మనం చూసిన తరహా కథే అయినా స్క్రీన్ ప్లే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పుడీ చిత్రం జీ5 (ZEE5) ఓటీటీలో జనవరి శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవనుంది. లవ్‌స్టోరీ, తండ్రి ఎమోషనల్ డ్రామా చిత్రాలు ఇష్టపడే వారు ఈ మూవీని ఒకమారు ప్రయత్నించవచ్చు. కానీ అక్కడక్కడ ఒకటి రెండు ముద్దు సీన్లు, కొన్ని పాత్రలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కావున పిల్లలతో సినిమా చూడకపోవడం బెటర్.