Ballerina OTT: యాక్షన్ ఫ్యాన్స్‌కి పండుగే.. సడన్‌గా ఓటీటీకి వచ్చి షాకిచ్చిన బాలెరినా
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:43 PM
జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన భారీ విజయం సాధించిన హాలీవుడ్ చిత్రం బాలేరినా
గత నెల జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన భారీ విజయం సాధించిన హాలీవుడ్ చిత్రం బాలేరినా (Ballerina). ప్రఖ్యాతి చెందిన జాన్ వీక్ సినిమాల సిరీస్‌లో భాగంగా స్టాండ్ ఎలోన్‌గా తెరకెక్కిన ఈ సినిమా నెల తిరగక ముందే డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టి ప్రేక్షకులను, సినీ లవర్స్‌కు పెద్ద షాకే ఇచ్చింది. నిన్న మొన్నటివరకు మన తెలుగు, హిందీ మూవీస్ రిలీజై వారం తర్వాత ఓటీటీకి వస్తుండగా హాలీవుడ్ సినిమాలు మాత్రం మూడు నెలల తర్వాతే వచ్చేవి. కానీ ప్రస్తుతం రోజులు మారుతున్న కొద్ది ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు సైతం నెలల్లోపే ఓటీటీకి వస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
హాలీవుడ్ అగ్రతార, కుర్రకారు కలల రాణి అనా డి అర్మాస్ (Ana de Armas) ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించగా అంజెలికా హస్టన్, గాబ్రియేల్ బైర్న్, లాన్స్ రెడ్డిక్ (Lance Reddick), నార్మన్ రీడస్, ఇయాన్ మెక్‌షేన్ (Ian McShane) ప్రధాన పాత్రల్లో నటించగా జాన్ విక్ పాత్రధారి కీను రీవ్స్ (Keanu Reeves) గెస్ట్ రోల్‌లో దర్శనమిచ్చి ఎంటర్‌టైన్ చేశాడు. గతంలో టోటల్ రీకాల్, డై హర్డ్, అండర్ వరల్డ్ పేరుతో వరుస సినిమాలు తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్న లెన్ వైజ్‌మన్ (Len Wiseman) ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. సుమారు 90 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 110 మిలియన్ డాలర్లను సంపాదించి సూపర్ హిట్‌గా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఎవ్ మకారో తన తండ్రిని చంపిన హంతకులను ఎప్పటికైనా మట్టుబెట్టాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ట్రైనింగ్ సైతం తీసుకుంటుంది. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మకారో ఓ ప్రాజెక్టులో ఓ అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఆ తర్వాత తనపై హత్యాయత్నం జరిగిన సమయంలో చిన్నతనంలో తన తండ్రిని చంపిన హంతకుడి చేతిపై సింబల్‌ను గుర్తు పట్టి వారి కోసం వేట మొదలు పెడుతుంది. ఈక్రమంలో అసలు హంతకులను పట్టుకుంద, ప్రాణాలతో బయట పడిందా లేదా అనే కథకథనాలతో సినిమా సాగుతూ అదిరిపోయే యాక్షన్ సినిమాలతో స్టన్ చేస్తుంది.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo Rent), యాపిల్ ప్లస్ (AppleTv+) ఓటీటీల్లో ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లోనూ రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది వచ్చే వారం నుంచి మన దేశంలోనూ స్ట్రీమింగ్ కానుంది. కాకుంటే ప్రస్తుతం ఇండియాలో థర్డ్ పార్టీ ప్రీ వెబ్‌సైట్లలో సినిమా అవలెబులగా ఉంది. జాన్ విక్ మూవీ లవర్స్, యాక్షన్ ప్రియులు ఒకటికి రెండు సార్లు ఈ బాలేరినా (Ballerina) సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.