12A Railway Colony OTT: సైలెంట్‌గా.. ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ థ్రిల్లర్
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:44 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను బాగా నిరుత్సాహ పర్చిన అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన చిత్రం‘12 ఎ రైల్వే కాలనీ’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెలలో థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను బాగా నిరుత్సాహ పర్చిన అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన చిత్రం‘12 ఎ రైల్వే కాలనీ’ (12A Railway Colony). గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకుని డీలా పడిపోయింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పొలిమేర చిత్రాల దర్వకుడు ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ అందించగా నాని కాసరగడ్డ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కామాక్షి భాస్కర్ల, హర్ష చెముడు, గెటప్ శ్రీను, సద్దాం, అవీష్ కురువిల్లా, జీవన్ ఇతర పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. అనాథ అయిన కార్తీక్ నలుగురి మిత్రులతో కలిసి టిల్లు అనే ఓ రాజకీయ నాయకుడి వద్ద పని చేస్తుంటారు. పక్క ఇంట్లో ఉండే క్రీడాకారిణి ఆరాధనను లవ్ చేస్తూ ఉంటాడు. అయితే.. ఓ రోజు పొలిటీషియన్ టిల్లు తను ఎమ్మెల్యేగా గెలవాలని క్షుద్ర పూజలు చేయించిన అనంతరం ఓ కవర్ కార్తీక్‌కు ఇచ్చి చాలా రహస్యంగా దాచాలని చెబుతాడు. దాంతో కార్తీక్ ఆ కవర్ తన ప్రేయసి ఇంట్లో ఎవరూ లేరని కొన్నాళ్ల పాటు అక్కడ దాచేందుకు ఆనుకూలంగా ఉంటుందని భావించి ఆ ఇంట్లోకి దొంగ చాటుగా వచ్చి ఆ కవర్ దాచే ప్రయత్నం చేస్తున్న సమయంలో తన ప్రేయసి, ఆమె తల్లి హత్య చేయబడి ఉండడం కనిపిస్తుంది. ఇంతకు వాల్లను ఎవలరు హత్య చేశారు, వారికి ముంబైలో డాక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి, టిల్లుకు ఈ స్టోరీకి ఉన్న లింకేంటి చివరకు హీరో ఈ కేసును చేధించగలిగాడా లేదా అనేది కథ.
అయితే.. ఇప్పటికే ఇలాంటి సినిమాలు పదుల సంఖ్యలో చూసి ఉండడం, ఎటువంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకుండా తర్వాత రాబోయేదేంటనేది ముందే గ్రహించేలా సినిమా సాగుతుంది. పైగా ఫస్టాఫ్ అంతా బాగా లాగ్ ఉండి ఎంతకు కథలోకి వెళ్లకపోవడం లాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video IN) ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అసలు టైంఫాస్ కాని వాళ్లు ఒకమారు మాత్రం ట్రై చేయవచ్చు.