House Full5: మీ సహానాన్ని పరీక్షించే సినిమా.. ఓటీటీకి వచ్చేసింది
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:21 PM
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై నెగిటావ్ తెచ్చుకుని హిట్ అయిన చిత్రం హౌస్ ఫుల్ 5 ఓటీటీకి వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై నెగిటావ్ తెచ్చుకుని హిట్ అయిన చిత్రం హౌస్ ఫుల్ 5. ఇండియాస్ బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా మంచి ప్రేక్షకాదరణ పొందిన హౌస్ ఫుల్ (House full) చిత్రాల సిరీస్‌లో గతంలో నాలుగు భాగాలు రిలీజై ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడమే కాక ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందించాయి. ప్రధానంగా నాలుగో భాగంలోని బాల బాల అనే పాట ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ తీసుకు వచ్చింది. తాజాగా ఈ సిరీస్‌లో ఐదో భాగంగా వచ్చిన ఈ చిత్రానికి తరుణ్ మన్సుఖాని (Tarun mansukhani) దర్శకత్వం వహించగా సాజిద్ నడియావాలా (Sajid Nadiadwala's) నిర్మించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. ఓ బిలియనీర్ తన ఆస్తిని తన వారసులకు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలో నాలుగైదు జంటలు ఆ వారసులం మేమే అంటూ బిలియనీర్ వెళ్తున్న షిప్‌లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. సడన్‌గా ఓరోజు రాత్రి ఆ షిప్‌లో హత్య జరుగుతుంది. అక్కడ ఉన్న వారిలో ఆ మర్డర్ ఎవరు చేశారో తెలియక అంతా తికమక పడుతూ ఉంటారు. ఎవరినీ చూసిన అనుమానంగానే కనబడుతుటారు. ఈలోపు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపులు తిరుగుతూ హంతకుడిని పట్టుకున్నారా, ఆ ఆస్తి ఎవరికి దక్కింది అనే కథకథనాలతో సినిమా ఉండనుంది.
అయితే.. ఈ కథను గమనిస్తే తెలుగులో మూడేండ్ల క్రితం వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఎఫ్3 సినిమాను పోలి ఉండడం గమనార్హం. అందులోనూ హీరోలు ఇద్దరు ఆస్తి కోసం ఓ ఫ్యాలెస్‌కు వెళ్లడం వారసుడిగా నిరూపించుకునేందుకు చేసే సాహసాల నేపథ్యంలోనే సినిమా ఉంటుంది. సరిగ్గా అలానే ఇందులో మక్కీ టూ మక్కీ ఉంటుంది. కాకపోతే ప్రతి సీన్‌లో 10 మందికి పైగా నటులు కనిపిస్తూ తెర నిండా సందడి చేస్తుంటారు. అక్కడ సినిమా అంతా ఫ్యాలెస్‌లో ఉంటే ఇక్కడ మూవీ అసాంతం క్రూయిజ్ షిప్‌లోనే ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులు, సన్నివేశాలు, హీరోయున్ల అంగాంగ ప్రదర్శణలు, నటుల ఓవర్ యాక్టింగ్స్ అన్నీ అంతకు మించి అనేలా అధికంగానే ఉంటాయి.
ఇక.. మొదటి నాలుగు భాగాలలో నటించిన అక్షయ్ కుమార్ (Akshay Kumar), రితేశ్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh) లతో పాటు సగం బాలీవుడ్ స్టార్స్ ఈ 5వ సినిమాలో నటించడం విశేషం. అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), జాకీ ష్రాఫ్ (Jackie Shroff), నానా పటేకర్ (Nana Patekar), సంజయ్ దత్ (Sanjay Dutt), సోనమ్ బజ్వా (Sonam Bajwa), జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నగ్రీస్ ఫక్రీ (Nargis Fakhri), చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్ (Fardeen Khan), చుంకీ పాండే, శ్రేయస్ తల్పడే (Shreyas Talpade), డినో మోరియా, జానీ లీవర్ (Johnny Lever) ఇంకా చాలామంది ఈ సినిమాలో కనిపిస్తారు. ఇదిలాఉంటే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అదీ కూడా రెంట్ పద్దతిలో.. ఒకవేళ ఈ సినిమాను ఇప్పుడే ఓటీటీలో చూడాలనుకుంటే డబ్బును చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఓ వారం పది రోజుల తర్వాత అయితే ఉచితంగానే చూసేయవచ్చు.