The Descent OTT: ప్రపంచాన్నే వణికించిన హర్రర్ థ్రిల్లర్.. ఇరవై యేండ్ల తర్వాత తెలుగులో ఓటీటీకి
ABN, Publish Date - Jul 06 , 2025 | 07:37 PM
2005లో విడుదలై ప్రపంచాన్నే వణికించిన ఓ బ్రిటీష్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
2005లో థియేటర్లలో.. విడుదలై ప్రపంచాన్నే వణికించిన ది డీసెంట్ (The Descent) అనే ఓ బ్రిటీష్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. షానా మక్డోనాల్డ్ (Shauna Macdonald), నటాలీ మెన్డోజా (Natalie Mendoza), అలెక్స్ రీడ్ (Alex Reid), సాస్కియా ముల్డర్ (Saskia Mulder), నోరా-జేన్ నూన్, మైఅన్నా బరింగ్ కీలక పాత్రల్లో నటించగా గతంలో డూమ్స్ డే, మెల్ బాయ్ వంటి భారీ చిత్రాలను రూపొందించిన నీల్ మార్షల్ (Neil Marshall) దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం వచ్చి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కేరియస్ట్ థ్రిల్లర్‌గా ఈ మూవీకి పేరుంది.
కథ విషయానికి వస్తే.. ర్యాప్టింగ్ ట్రిప్ పూర్తి చేసుకుని వస్తున్న క్రమంలో జరిగిన కారు ప్రమాదంలో సారా తన భర్తను, కూతురుని కోల్పోవడంతో సారా డిప్రెషన్‌లోకి వెళుతుంది. దీంతో ఓ ఏడాది తర్వాత సారాను అ ఆలోచనలో నుంచి బయటకు తీసుకు రావాలని ఓ ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి సిటీ బయట పర్వత ప్రాంతాల్లో ఉన్న ఓ భూగర్భ గుహకు ట్రిప్ వెళతారు. అయితే వారు దారి తప్పి మరో గుహాలోకి వెళతారు. ఈ క్రమంలో వారికి భయంకర పరిస్థితులు ఎదురౌతాయి. అక్కడ ఉన్న వింత క్రియేచర్స్ ఉన్నట్టుండి వారిపై దాడికి దిగుతాయి. ఈ నేపథ్యంలో వారు అక్కడి నుంచి బయట పడగలిగారా లేదా, చివరకు ఎంత మంది బతికి బట్ట కట్టారనే పాయింట్‌తో 1 గంట 35 నిమిషాలు నిడివిలో సినిమా సాగుతుంది.
చెప్పడానికి, వినడానికి, చూడడానికి ఇది ఓ రోటిన్ కథే అయినా, మనం ఇప్పటికే వందల సినిమాలు చూసినా ఈ మూవీ మాత్రం వాటిన్నింటికీ పూర్తి విరుద్దంగా ఉంటుంది. సినిమా ఆరంభమైన పది నిమిషాలకు మొదలై ఎండ్ కార్ట్ పడే వరకు చూసే ప్రేక్షకులను ప్రతి ఒక్కరినీ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. మరో రకంగా చెప్పాలంటే వెన్నులో వణుకు పుట్టించే విధంగా సన్నివేశాలు వస్తూ గుండెలు జారిపోయేలా చేస్తాయి. నెక్స్ట్ ఏం కానుంది, వాళ్లు బయట పడాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. విజువల్స్, బ్యా గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే థ్రిల్ అందిస్తాయి. హర్రర్, సర్వైవల్ సీన్లు గూస్ బంప్స్ తీసుకు వస్తాయి.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. అదేవిధంగా దీని తర్వాత 2009లో సీక్వెల్ ది డిసెంట్ 2 వచ్చినా అంతగా విజయం సాధించలేక పోయింది. ఈ డిసెంట్ 2 (The Descent). సినిమా కూడా ప్రైమ్‌లోనే ఉంది. మంచి హర్రర్, థ్రిల్లర్, సినిమాలు ఇష్ట పడే వారు ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా చూడాల్సిన మూవీ ది డీసెంట్ (The Descent). ఎక్కడా ఎలాంటి అసభ్య, అశ్లీల సీన్లు ఏమీ లేవు ఫ్యామిలీ అంతా కలిసి చూసేయవచ్చు. అయితే కొన్ని సన్నివేశాల్లో తీవ్ర రక్తపాతం, భయపెట్టే దృశ్యాలు ఉన్నందు వళ్ల పిల్లలను దూరంగా ఉంచడం మంచిది.