సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Subham OTT: సీరియ‌ల్స్ చూసి.. ద‌య్యాలుగా మారే పెళ్లాలు! ఓటీటీకి వ‌చ్చేసిన.. స‌మంత శుభం

ABN, Publish Date - Jun 13 , 2025 | 07:05 AM

సౌత్ సూప‌ర్ స్టార్ స‌మంత మొట్ట మొద‌టి సారిగా నిర్మాత‌గా మారి నిర్మించిన చిత్రం ‘శుభం’.

subham

సౌత్ సూప‌ర్ స్టార్, అగ్ర క‌థానాయిక స‌మంత (Samantha) మొట్ట మొద‌టి సారిగా నిర్మాత‌గా మారి నిర్మించిన చిత్రం ‘శుభం’ (Subham). మే రెండో వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుని సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. 'సినిమాబండి' ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కండ‌రేగుల (Praveen kandregula) మ‌లి ప్ర‌య‌త్నంగా ఈ చిత్రానికి ద‌ర్వ‌క‌త్వం వ‌హించ‌గా.. హ‌ర్షిత్ రెడ్డి (Harshith Reddy), గ‌విరెడ్డి శ్రీనివాస్ (Gavireddy Srinivas), చ‌ర‌ణ్ పేరి (Charan Peri), శ్రీయ కొంతం (Shriya Kontham), శ్రావ‌ణి ల‌క్ష్మి (Shravani Lakshmi), శాలిని కొండెపూడి (Shalini Kondepudi) కీల‌క పాత్ర‌లు చేశారు. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. భీముని పట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ కమ్ ఓనర్‌ శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి) అదే ఊరిలో బ్యాంక్‌లో పని చేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే.. అతని శోభ‌నం రోజే భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. అలా రోజు జ‌రుగుతండ‌డంతో త‌న మిత్రుల‌తో చ‌ర్చించ‌గా.. ఆ ఊరి మొత్తం అదే పరిస్థితి అని తెలుస్తుంది. రాత్రి తొమ్మిది కాగానే ఊరిలోని ఆడాళ్లంతా జన్మజన్మల బంధం అనే టీవీ సీరియల్‌కు బానిస‌గా మారి దానిని చూస్తూ దెయ్యాలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అడ్డుకునే భర్తలపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తీరా సీరియల్ పూర్తయ్యాక ఏమీ జరగనట్లు మాములుగా ఉంటారు. దీంతో మ‌గాళ్లు తమ పరువు ఎక్క‌డ‌ పోతుందోన‌ని బ‌య‌ట‌కు తెలియ‌నియ్య‌రు.

ఈ స‌మ‌స్య నుంచి బయట పడడానికి శ్రీను, అత‌ని మిత్రులు మాయ మాతాశ్రీ (సమంత)ను ఆశ్రయిస్తారు. ఈక్ర‌మంలో మాయ ఏం చెప్పింది? జన్మజన్మల బంధం సీరియల్‌కి , ఆత్మలకు మ‌ధ్య ఉన్న‌ సంబంధం ఏమిటి? ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా? అసలు ఇందులో మాయ పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగిందన్నది ‘శుభం’ కథ. సినిమా మొత్తం సీరియల్ చుట్టూ తిరిగే హారర్-కామెడీ కథ. అయితే క‌థ‌, క‌థ‌నం స్లోగా సాగినా కాన్పెస్ట్ కొత్త‌గా ఉండి ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది. ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో జూన్ 13 శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, ఫ్యామిలీతో చూడాల‌నుకునే వారు ఈ ‘శుభం’ (Subham) మూవీని ఒక‌సారి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అయితే కొన్ని సీన్ల విష‌యంలో మాత్రం చూసిన‌వే మళ్ళీ చూస్తున్నామనే ఫీలింగ్ వ‌స్తుంది.

Updated Date - Jun 13 , 2025 | 09:47 AM